తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సంచలన నిర్ణయం... 37 నేతలకు లేఖలు
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన దేశంలోని పలు రాజకీయ పార్టీలకు లేఖలు రాశారు. మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడుదాం రండంటూ ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు దేశంలోని రాజకీయ పార్టీల్లో 37 మంది నేతలకు ఆయన లేఖ రాశారు. అఖిల భారత సామాజిక న్యాయం పేరుతో ఆయన ఈ లేఖ రాశారు.
ప్రధానంగా దేశంలో పెరిగిపోతున్న మతోన్మాదానికి వ్యతిరేకంగా సమానత్వం, ఆత్మగౌరవం, సామాజిక న్యాయంపై విశ్వాసమనున్నవారంతా ఏకతాటిపైకి రావాలని ఆయన పిలుపునిచ్చారు.
అంతేకాకుండా, మతోన్మాదం, మతపరమైన ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడేందుకు ముందుకు రావాలని సీఎం స్టాలిన్ తన లేఖలో పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ఐక్యంగా ఏకతాటిపైకి వస్తే మినహా ఈ మతోన్మాదం, మతపరమైన ఆధిపత్యంపై పోరాటం చేయలేమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ లేఖలను కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, కేరళ సీఎం విజయన్, పుదుచ్చేరి సీఎం రంగస్వామి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తదితరులు ఉన్నారు.