దేవదాయశాఖ మంత్రి తెలుగు అక్షరాలు నేర్చుకోవాలి: గోవిందానంద సరస్వతి
శ్రీవారిని అంగట్లో అమ్మొద్దన్నారు కిష్కింధ హనుమ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు వ్యవస్ధాపకులు గోవిందానందసరస్వతి స్వామీజీ. శ్రీవారిని రోడ్డు మీద పెట్టి స్వామి సేవలు కోటి రూపాయలకు అమ్ముతున్నారా అంటూ ప్రశ్నించారు. శ్రీవారి సేవలు వెలకెట్టలేనిదన్నారు.
శ్రీవారి సేవలను టిక్కెట్ల రూపంలో అమ్మి ఆసుపత్రి కట్టాలంటే అది సమంజనం కాదన్నారు. స్వామివారి పేరు చెప్పి సొమ్ము ఒకడిది.. సోకు మరొకడిది అనే విధంగా టిటిడి వ్యవహరిస్తోందన్నారు.
సేవల అమ్మకంపై టిటిడి నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు.ఇప్పటికే టిటిడి బోర్డు నవ్వుల పాలైందని..ఈఓ పేరిట ప్రభుత్వాలే ఆలయాలే స్థిర నివాసం ఏర్పరచుకుందన్నారు.
ఆలయాలను కబ్జా చేసుకుని నిధులను తమ ప్రభుత్వం ఎజెండాకు వినియోగించుకోవడం చట్ట విరుద్ధమని..జియ్యర్ స్వాములు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. ఆలయాల్లో బాధ్యత నిర్వర్తిస్తున్న మతపరమైన అంశాల జోలికి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోను వెళ్ళరాదన్నారు.
టిటిడికి అసలు ఈవోనే అవసరం లేదన్నారు. దేవదాయశాఖామంత్రి వెల్లంపల్లి శ్రీనివాసులు తెలుగు అక్షరాలు చదవడం ముందు నేర్చుకోవాలన్నారు. దేవదాయశాఖ గురించి మంత్రికి అన్నీ తెలుసా అంటూ సూటిగా స్వామీజీ ప్రశ్నించారు. తిరుపతిలో జరిగిన మీడియా సమావేశంలో స్వామి గోవిందానందస్వామీజీ మాట్లాడారు.