శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 5 జూన్ 2021 (17:49 IST)

గోవిందానంద సరస్వతికి పురాణాలు తెలియవు, తిరుమలలోనే ఆంజనేయుడు జన్మించాడు

టిటిడి, హనుమాన్ జన్మతీర్థ క్షేత్ర ట్రస్ట్ వ్యవస్ధాపకుకుడు గోవిందానందసరస్వతికి మధ్య వివాదం నడుస్తూనే ఉంది. సరిగ్గా రెండు నెలల నుంచి హనుమంతుడి జన్మస్థానంపైనే ఈ వివాదం నడుస్తోంది. తిరుమలలోని అంజనాద్రిలోనే హనుమంతుడు పుట్టాడని టిటిడి వాదిస్తుంటే.. కాదు కర్ణాటక రాష్ట్రంలోని హంపిలో పుట్టాడని గోవిందానందసరస్వతి చెబుతున్నారు.
 
అయితే ఈ వ్యవహారం ఇప్పటిది కాదు. ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయకున్నా గోవిందానందసరస్వతి మాత్రమే అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. శ్రీరామనవమి రోజు టిటిడి ఏకంగా ఆంజనేయుడు తిరుమలలో పుట్టారని అందుకు ఆధారాలు ఉన్నాయని ప్రకటించింది. దీంతో వివాదం మొదలైంది.
 
హంపిలోని కిష్కింధలోనే ఆంజనేయుడు  జన్మించాడంటూ చెబుతున్నారు గోవిందానందసరస్వతి. టిటిడి తప్పుల మీద తప్పులు చేస్తోందని.. ఎందుకు ఇలా చేస్తోందని ప్రశ్నించారు గోవిందానందసరస్వతి. టిటిడి ఒక తప్పు చేసి మళ్ళీ మళ్ళీ తప్పులను చేసుకుంటూ వస్తోందన్నారు.
 
అయితే తాజాగా టిటిడి ఈఓ కె.ఎస్.జవహర్ రెడ్డి దీనిపై స్పందించారు. అసలు గోవిందానందసరస్వతికి పురాణాల గురించి తెలియవన్నారు. హనుమంతుడి జన్మస్థలం తిరుమలేనని స్పష్టం చేశారు. టిటిడిపై విమర్సలు ఇప్పటికైనా గోవిందానందసరస్వతి మానుకోవాలన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సంధర్భంగా తిరుపతిలో మొక్కలు నాటిన టిటిడి ఈఓ ఈ వ్యాఖ్యలు చేశారు.