సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 21 ఆగస్టు 2021 (23:39 IST)

మొన్న జయరాం, నిన్న వేణుగోపాలక్రిష్ణ, నేడు వెల్లంపల్లి

తిరుమలలో శ్రీవారి దర్సనానికి కూడా తమ అనుచరులను గుంపులు గుంపులుగా వెంటపెట్టుకుని వెళుతున్నారు వైసిపి ప్రజాప్రతినిధులు. ముఖ్యంగా మంత్రులైతే పదుల సంఖ్యలో అనుచరులు, బంధువులను వెంటపెట్టుకుని తిరుమల శ్రీవారిని దర్సించుకుంటున్నారు.
 
మొన్న కార్మికశాఖా మంత్రి జయరాం 30 మందితో దర్సనం, నిన్న బిసి శాఖామంత్రి చెల్లుబోయిన వేణుగోపాలక్రిష్ణ 47 మందితో దర్సనం, నేడు దేవదాయశాఖామంత్రి వెల్లంపల్లి శ్రీనివాసులు 67 మందితో దర్సనం. సాధారణంగా విఐపి దర్సనం దొరకడమే కష్టతరమవుతున్న పరిస్థితి.
 
అలాంటిది ఏకంగా పదుల సంఖ్యలో అనుచరులు, బంధువులను వెంటేసుకుని ఆలయంలోకి వెళ్ళిపోతున్నారు మంత్రులు. దేవదాయశాఖామంత్రి అయిన వెల్లంపల్లి శ్రీనివాసులు నిబంధనలకు లోబడి ప్రవర్తించాల్సింది పోయి ఆయనే నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారు.
 
విఐపి విరామ దర్సనా సమయంలో వేరే భక్తులను నిలపకుండా దేవదాయశాఖామంత్రితో పాటు వచ్చిన వారిని మాత్రమే అనుమతించారు టిటిడి అధికారులు. సుమారు 25 నిమిషాల పాటు వీరికి దర్సనాన్ని టిటిడి కల్పించింది. సాధారణంగా అయితే విఐపిలతో పాటు నలుగురో, ఐదుగురో వస్తుంటారు.. అలాంటిది దేవదాయశాఖామంత్రి ఈ స్థాయిలో ఇంతమందిని వేసుకుని రావడం విమర్సలకు తావిస్తోంది.