శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 15 ఆగస్టు 2021 (09:54 IST)

తిరుమల కొండపై శిలువ గుర్తు... తితిదే విజిలెన్స్ అధికారుల నిర్లక్ష్యం

తిరుమల కొండపైకి వచ్చిన ఓ కారుకు శిలువ గుర్తువున్నది. ఇది స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ విషయంలో తితిదే విజిలెన్స్ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. 
 
తిరుమ శ్రీవారి దర్శనానికి వచ్చిన ఓ ఇండికా కారుపై శిలువ గుర్తును గమనించకుండా సదరు వాహనాన్ని టీటీడీ విజిలెన్స్ అధికారులు తిరుమలకు అనుమతించారు. తనిఖీల సమయంలో కారును క్షుణంగా తనిఖీ చేయని విజిలెన్స్ సిబ్బంది.. శిలువ గుర్తు ఉన్న ఆ ఇండికా కారు తిరుమలకు అనుమతించారు.
 
అయితే టీటీడీ విజిలెన్స్ అధికారులు నిర్లక్ష్యం కారణంగా కారు వెనుక అద్దంలో ‘శిలువ గుర్తు, ave Maria’ అనే అన్యమత శ్లోకంతో ఆ కారు తిరుమలకు వచ్చింది. అయితే ఇది గమనించిన.. కింది స్థాయి అధికారులు టీటీడీ విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆ కారును పట్టుకున్న టీటీడీ విజిలెన్స్ అధికారులు.. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాహనంగా గుర్తించారు. 
 
తాము హిందువులమేనని, తిరుమల యాత్ర కోసం కారు అద్దెకు తీసుకున్నామని వాహనంలోని భక్తులు తెలిపారు. అనంతరం అన్యమత చిహ్నాన్ని తొలగించి దర్శనానికి అనుమతించాలని కోరడంతో విజిలెన్స్‌ సిబ్బంది సదరు భక్తులను అనుమతించారు.