శ్రీవారిని దర్శించుకున్న పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి
రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు సంతోషంగా ఉండాలని తాను కోరుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చెప్పారు.
మేకపాటి గౌతమ్ రెడ్డి తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఎప్పుడు స్వామి వారి దగ్గరకు వచ్చినా కోరుకున్నట్టుగానే, రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు ఆయన వెల్లడించారు.
తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలన దిగ్విజయంగా కొనసాగాలని స్వామివారిని ప్రార్థించినట్లు మంత్రి మేకపాటి పేర్కొన్నారు. శ్రీవారి దర్శనంలో మంత్రి మేకపాటితో పాటు ఆయన సతీమణి శ్రీకీర్తి, కుమారుడు అర్జున్ ఉన్నారు.
మంత్రి మేకపాటి మాట్లాడుతూ, శ్రీవారి దయ వల్ల రాష్ట్రానికి అంతా మంచి జరగాలని, పరిశ్రమలు కొత్తగా విలసిల్లాలని ఆకాంక్షించారు.