శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: బుధవారం, 11 ఆగస్టు 2021 (17:19 IST)

రెడ్డిగారు, సుబ్బారెడ్డి గారు ఆత్మీయ ఆలింగనం, అంతమంది ఉండగా ఆయనతోనే..?

రెండవసారి తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి ఛైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు వై.వి.సుబ్బారెడ్డి. ఎంతోమంది ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. చాలామంది ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. చాలామంది కరచాలనం చేసి అభినందనలు తెలిపారు. 
 
తిరుమలలోని ఆస్థానమండపంలో ఉదయం 9.45 నిమిషాలకు అట్టహాసంగా ప్రమాణస్వీకారం జరిగింది. అయితే ఈ ప్రమాణ స్వీకార మహోత్సవంలోనే ప్రత్యేక అట్రాక్షన్‌గా నిలిచారు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. 
 
అందరితోను కరచాలనంతో అభినందనలు తెలిపిన సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డిని మాత్రం రెడ్డిగారు అంటూ ఆప్యాయంగా పిలుస్తూ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. టిటిడి ఛైర్మన్ కాక ముందు నుంచి కరుణాకర్ రెడ్డితో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అంతేకాదు మృదుస్వభావుడిగా, మంచి వ్యక్తిగాను, ఎమ్మెల్యేగా మంచి పేరు సంపాదించుకున్నారు కరుణాకర్ రెడ్డి.
 
అందుకే సుబ్బారెడ్డికి కరుణాకర్ రెడ్డి అంటే అంత అభిమానం. అంతేకాదు టిటిడి నిధులతో తిరుపతిలో ఎన్నో అభివృద్థి కార్యక్రమాలను జరుగుతూ ఉండడం.. ఆ కార్యక్రమాలకు కరుణాకర్ రెడ్డితో కలిసి పనిచేయడం సుబ్బారెడ్డి చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలోను కరుణాకర్ రెడ్డి టిటిడి ఛైర్మన్‌గా ఉండటంతో ఆ పరిచయాలు కూడా ఉన్నాయి. 
 
ఇదంతా కలగలిపి చివరకు టిటిడి ఛైర్మన్ ప్రమాణ స్వీకారంలో భూమన కరుణాకర్ రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అందరిలోను చర్చకు కారణమయ్యారు.