1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Mohan Babu Shocking Comments on Political Leader

రాజకీయ నేతల్లో 95 శాతం మంది నీచులు : మోహన్ బాబు

రాజకీయ నేతలుగా ఉన్నవారిలో 95 శాతం మంది నీచులు అని సినీ నటుడు డాక్టర్ మోహన్ బాబు అన్నారు. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న 'ఇండియాటుడే కాన్‌క్లేవ్‌ సౌత్'లో తన కుమార్తె లక్ష్మీప్రసన్నతో కలిసి ఆయన పాల్గొన్నా

Mohan Babu
రాజకీయ నేతలుగా ఉన్నవారిలో 95 శాతం మంది నీచులు అని సినీ నటుడు డాక్టర్ మోహన్ బాబు అన్నారు. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న 'ఇండియాటుడే కాన్‌క్లేవ్‌ సౌత్'లో తన కుమార్తె లక్ష్మీప్రసన్నతో కలిసి ఆయన పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా మాట్లాడుతూ నేటి రాజకీయ నాయకుల్లో 95 శాతం మంది రాస్కెల్స్‌ (నీచులు). ఒక్కొక్కరికి 25 వేల ఎకరాలున్నాయి. రూ.25 వేల కోట్లు సంపాదించారు. ఆ డబ్బంతా వారికి ఎక్కడి నుంచి వచ్చింది? అని నటుడు మోహన్‌బాబు ఉద్వేగంగా ప్రశ్నించారు. 
 
తన స్నేహితుడు, సోదరుడు ఎన్టీఆర్‌కు అవినీతి అంటేనే తెలియదని, ఆయనే తనను రాజ్యసభకు పంపగా ఎలాంటి మచ్చ లేకుండానే తిరిగివచ్చానని అన్నారు. ఎన్నికలకు ముందు తిరుపతిలోని తన విద్యాసంస్థలకు వస్తానని మాటిచ్చిన మోడీ ప్రధాని అయ్యాక మర్చిపోయారన్నారు. సినిమా రంగంలో ఉన్నానని తెలిసి అమ్మాయిని ఇచ్చేందుకు అప్పట్లో ఎవరూ ముందుకు రాలేదని గుర్తుచేసుకున్నారు. 
About Writer
selvi
తర్వాతి కథనం
జియో నెట్‌వర్క్ వేస్ట్.. ఆ స్పీడ్ అందుకోలేవట..