శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By tj
Last Updated : బుధవారం, 17 జనవరి 2018 (15:48 IST)

ఏపీలో ఆ సీట్లు నాకొదిలేయ్.. ప్రధాని మాటలతో బాబు షాక్

ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా ప్రధాని నరేంద్ర మోడీ ఏదో ఒక షాక్ ఇస్తూనే ఉన్నారట. ఏపీలో ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో కేంద్రం నుంచి ఎక్కువ నిధులు తెచ్చుకునేందుకు చంద్రబాబు నాయుడ

ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా ప్రధాని నరేంద్ర మోడీ ఏదో ఒక షాక్ ఇస్తూనే ఉన్నారట. ఏపీలో ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో కేంద్రం నుంచి ఎక్కువ నిధులు తెచ్చుకునేందుకు చంద్రబాబు నాయుడు నెలకో, రెండునెలలకో ఒకసారి ఢిల్లీకి వెళ్ళి ప్రధానిని కలిసి వస్తున్నారు. అయితే చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక సమస్య ఉత్పన్నమవుతోందట. ఈ సారి ఏకంగా చంద్రబాబునాయుడు ముందు ఒక ప్రపోజల్ పెట్టినట్టు సమాచారం. ఆ ప్రపోజల్ విన్న బాబు షాకై కొద్దిసేపు తేరుకోలేకపోయారట.
 
వచ్చే ఎన్నికల్లో లోక్‌సభ స్థానాల సీట్లన్నీ తమకు అప్పగించి.. అసెంబ్లీ స్థానాలన్నీ మీరే పోటీ చేసుకోండి.. ఇలా చేస్తే బాగుంటుందని ప్రధాని చెప్పారట. అయితే ఎంపీ సీట్లు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలిచి తీరుతుందన్న నమ్మకం బాబుకు ఉంది. ఇప్పటికే చాలామంది ఎంపిలు ఏపీ నుంచి ఉన్నారు. 
 
అలాంటిది మోడీ లోక్‌సభ స్థానాలన్నీ తమకే వదిలేయండి చెబితే బాబుకు ఏం చెప్పాలో అర్థంకాక సైలెంట్ అయిపోయారట. కాస్త ఆలోచించుకుని చెబుతానని ప్రధానికి సమాధానం చెప్పి బాబు బయటకు వచ్చేసినట్లు తెలుస్తోంది. ఈసారి మోడీ ఏకంగా లోక్‌సభ స్థానాలకే ఎసరు పెట్టడం బాబుకు ఏ మాత్రం మింగుడుపడటం లేదట. మరోవైపు కేంద్రం వద్ద సాగిలపడి బాబు ప్రవర్తిస్తున్న తీరుపై మాత్రం ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు.