శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: మంగళవారం, 16 జనవరి 2018 (22:18 IST)

ప్రయాణీకుడికి సారీ చెప్పిన ఎపి సిఎం చంద్రబాబు నాయుడు

తనవల్ల ఇబ్బందిపడ్డ ఓ సామాన్య వ్యక్తికి సీఎం సారి చెప్పిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఈ రోజు నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు నాయుడు ఇంటిముందు గంటకు పైగా ప్రజల నుండి వినతులను స్వీకరిస్తుండగా ఆదారిలో రెండు గంటలు పాటు వాహన రాకపోకలను నిలిపివేశారు.

తనవల్ల ఇబ్బందిపడ్డ ఓ సామాన్య వ్యక్తికి సీఎం సారి చెప్పిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఈ రోజు నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు నాయుడు ఇంటిముందు గంటకు పైగా ప్రజల నుండి వినతులను స్వీకరిస్తుండగా ఆదారిలో రెండు గంటలు పాటు వాహన రాకపోకలను నిలిపివేశారు. దీంతో హైదరాబాదు నుండి స్వగ్రామం వెళ్ళుతున్న చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం, దిగువ మూర్తిపల్లెకు చెందిన నవీన్ తన కుటుంబ సభ్యులతో కలిసి పక్కనున్న ఎ.రంగంపేట గ్రామం నుండి సుమారు కిలో మీటర్ దూరం కాలినడకన పోతూ సీఎం ఇంటి వద్దకు చేరుకోగా అక్కడ సీఎం ప్రజల నుండి వినతులను స్వీకరిస్తుండగా నవీన్ పోలీసులపై అసహనం వ్యక్తం చేశారు. 
 
సీఎం చొరవ తీసుకుని సమస్య ను అర్థం చేసుకుని నవీన్ కు సారీ చెప్పాడు. వెంటనే ట్రాఫిక్‌ని సమస్యను పరిష్కరిచమని పోలీసులను అదేశించారు. దీంతో తన ఇబ్బంది గుర్తించి నందుకు సీఎం కు కృతజ్ఞతలు తెలిపి వెళ్లిపోయాడా వ్యక్తి.