మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 16 జనవరి 2018 (12:51 IST)

బోరున విలపించిన ప్రవీణ్ తొగాడియా... ఎన్‍కౌంటర్ చేస్తారని భయం...

తనను ఎన్‌కౌంటర్ చేయొచ్చు అని విశ్వహిందూ పరిషత్ అగ్రనేత ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు చేశారు. అదీ కూడా కేంద్ర ప్రభుత్వంపైన. హిందూత్వ ఐక్యత గురించి పదేపదే మాట్లాడుతుండటంతో కేంద్ర ప్రభుత్వం తనను చంపాలని

తనను ఎన్‌కౌంటర్ చేయొచ్చు అని విశ్వహిందూ పరిషత్ అగ్రనేత ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు చేశారు. అదీ కూడా కేంద్ర ప్రభుత్వంపైన. హిందూత్వ ఐక్యత గురించి పదేపదే మాట్లాడుతుండటంతో కేంద్ర ప్రభుత్వం తనను చంపాలని చూస్తోందంటూ ఆయన ఆరోపించారు. 
 
ఇదే అంశంపై ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, 'కేంద్ర ప్రభుత్వం నా గొంతు నొక్కాలని ప్రయత్నిస్తోంది. గుజరాత్, రాజస్థాన్ పోలీసులు నన్ను నిరంతరం వెంటాడుతున్నారు. నాపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. రాజస్థాన్ పోలీసులు నన్ను అరెస్ట్ చేయడానికే ఇక్కడకు వచ్చారు. వారు నన్ను ఎన్‌కౌంటర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం ఉంది అని ఆరోపించారు. 
 
ముఖ్యంగా, గత కొన్ని రోజులుగా తాను హిందూత్వ ఐక్యత గురించి ప్రయత్నిస్తున్నందునే నా గొంతు నొక్కాలని చూసున్నారు. నా ఆరోగ్యం కుదుటపడగానే గుజరాత్ పోలీసులకు లొంగిపోతాను అని తొగాడియా వెల్లడించారు.