1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Nagababu comments on currency note pictures

గాంధీ గారు బతికి ఉంటే అలా చెప్పేవారు.. కరెన్సీ నోట్లపై వారి బొమ్మలు..?

Nagababu
మెగా బ్రదర్ నాగబాబు మళ్లీ నోటికి పనిచెప్పారు. గాడ్సేపై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో కెక్కిన నాగబాబు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. భారత కరెన్సీ నోట్ల మీద సుభాష్ చంద్ర బోస్, అంబేద్కర్, భగత్ సింగ్, చంద్ర శేఖర్ ఆజాద్, లాల్ బహదూర్, పీవీ నరసింహారావు, అబ్దుల్ కలాం, సావర్కార్, వాజ్‌పేయి లాంటి మహానుభావుల చిత్రాలను కూడా చూడాలని ఉంది. ఎందుకంటే స్వతంత్ర భారత ఆవిర్భావానికి కృషి చేసిన మహానుభావులని జనం మర్చిపోకూడదని ఒక ఆశ అంటూ ట్వీట్ చేసారు. 
 
గాంధీ గారు బతికి ఉంటే ఆయన కూడా తనతో పాటు దేశానికి సేవ చేసిన దేశభక్తులని గౌరవించమని తప్పకుండా చెప్పేవారు. దేశం కోసం జీవితాల్ని త్యాగం చేసిన మహానుభావుల పేర్లు తప్ప మొహాలు గుర్తు రావడం లేదు. భావితరాలకు కరెన్సీ నోట్లపై వారి ముఖ పరిచయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది అంటూ మరో ట్వీట్ చేసారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు మళ్లీ వివాదాన్ని రేపాయి. 
About Writer
సెల్వి
తర్వాతి కథనం
కరోనా ఎఫెక్ట్.. కౌగిలింత, కిస్ సీన్స్ కూడా తగ్గిపోతాయ్ (video)