మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి వెంకటరమణ
Last Modified: శుక్రవారం, 22 మే 2020 (14:18 IST)

నాగబాబుకు ఆ విషయంలో రాంగోపాల్ వర్మ సపోర్ట్

ఏదైనా కాంట్రవర్శీ వచ్చిందంటే చాలు ఈ డైరెక్టర్ సినిమా తీయడానికి రెడీ అయిపోతాడు. మరెవరో కాదండీ మన ఆర్జీవీనే. నాథురాం గాడ్సే పుట్టినరోజు సందర్భంగా మెగా బ్రదర్ చేసిన ట్వీట్ పెద్ద దుమారాన్నే రేపుతోంది. 'గాంధీని చంపడం వలన దేశద్రోహి పేరొస్తుందని తెలిసినా కూడా అనుకున్నది చేశాడు.
 
ఆయన నిజమైన దేశభక్తుడు. అందుకే ఆయన పుట్టిన రోజు పురస్కరించుకుని గుర్తు చేసుకోవాలనిపించింది. పాపం నాథూరాం గాడ్సే. మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్' అంటూ ట్వీట్ చేసాడు. ఇక ఈ ట్వీట్‌పై సంచలనంగా మారింది, పలువురు రాజకీయ నాయకలు, నెటిజన్లు ఆయనను తప్పుబట్టడంతో వివరణ కూడా ఇచ్చుకున్నారు. అయితే మన ఆర్జీవీ మాత్రం నాగబాబుకు మద్దతుగా నిలిచారు. అంతటితో ఆగకుండా మరో బాంబు పేల్చారు.
 
ఆ సమయంలో జరిగిన విషయాలు పరిశీలించి గాడ్సేపై సినిమా తీయబోతున్నట్లు ప్రకటించారు. స్వతహాగా గాంధీ అనుచరుడిగా ఉన్న గాడ్సే ఆయనను చంపాల్సి వచ్చింది. ఎందుకు ఈ విషయాన్ని అప్పటి ప్రభుత్వం తొక్కి పెట్టింది. ఇదే కథాంశంతో సినిమా తీస్తానంటూ ప్రకటించారు.