శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 23 ఏప్రియల్ 2018 (16:57 IST)

ఆ యబ్బి బ్లడ్ బ్యాంకు పెట్టి... పబ్లిసిటీ చేసుకున్నాడు... శ్రీరెడ్డి తాజా పోస్ట్

నటి శ్రీరెడ్డి మరోమారు మెగాస్టార్ చిరంజీవిని కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని ఫేస్‌బుక్ పోస్ట్ చేసింది. క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై ఒంటరిపోరాటం చేపట్టిన శ్రీరెడ్డి.. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో

నటి శ్రీరెడ్డి మరోమారు మెగాస్టార్ చిరంజీవిని కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని ఫేస్‌బుక్ పోస్ట్ చేసింది. క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై ఒంటరిపోరాటం చేపట్టిన శ్రీరెడ్డి.. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో పాటు.. ఆయన తల్లిని దుర్భాషలాడింది. దీనివెనుక దర్శకుడు రాంగోపాల్ వర్మ ఉన్నట్టు స్వయంగా వెల్లడించారు. కానీ, పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగడంతో అసలు గుట్టు బహిర్గతమైంది. శ్రీరెడ్డి తమను టార్గెట్ చేయడం వెనుక కొన్ని పత్రికా చానెల్స్‌తో పాటు.. టీడీపీ నేతలు ఉన్నట్టు ఆరోపించారు. ఇది పెద్ద వివాదాస్పదమైంది. ఈనేపథ్యంలో శ్రీరెడ్డి తాజాగా చిరంజీవి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని మరోమారు ఫేస్‌బుక్ ఖాతాలో ఓ పోస్ట్ చేసింది. అది యధాతథంగా...
 
 
దగ్గర దగ్గర 28 శాతం విస్తరించి ఉన్న ఒక సామాజిక వర్గం, కులాభిమానం మెండుగా ఉండి అది తలకెక్కి ఆ ఒక్క కుటుంబం బాగుంటే మేము బాగున్నట్టే అనుకొని ఒక పిచ్చి భ్రమలో బతుకున్నారు.
 
మా కులంలో ఒక గొప్ప హీరో ఉన్నాడు, మిగిలిన ఇంకో సామజిక వర్గానికి ధీటైన పోటీ ఇచ్చాడు, మా పరువు నిలుపుతున్నాడు.... అనుకుంటూ ఒంటి మీద చొక్కా, కాలికి జోళ్ళు ఉన్నాయో లేదో చూసుకోకుండా 30 ఏళ్లుగా ఆ ఒక్క కుటుంబాన్ని మోస్తున్నారు.... ఏం ఒరిగింది మీకు?
 
ఆ కుటుంబం అద్దె ఇంటి నుండి డాబాకి, ఆడ నుండి మేడలోకి ఆపై రాజ భవనంలాంటి ఇళ్ళలోకి మారి భుజాన మోస్తున్న మిమ్మల్ని గేటు దగ్గరే ఆపేసారు. అందులో మీకు వచ్చింది మా కులంలో ఒక పెద్ద హీరో ఉన్నాడు అని ఒక ఫాల్స్ 'క్యాస్ట్ ప్రైడ్' అంతే.
 
ఆ కులాభిమానం వీక్నెస్‌ని.... ఆ కుటుంబం క్యాష్ చేస్కొని... ఆయన కుటుంబం నుండి ఇప్పటికి 8 మంది‌ని హీరోస్‌ని చేసి మీ మీదకి వదిలాడు. మీకు వచ్చింది ఏం ఉంది అందులో??
 
ఆ యబ్బి బ్లడ్ బ్యాంకు పెట్టి.... రక్తం నువ్వు ఇస్తే పబ్లిసిటీ తను చేస్కోన్నాడు..... ఐ బ్యాంకు పెట్టి కళ్ళు నువ్వు దానం చేస్తే ఆయన గొప్పతనంగా ప్రమోట్ చేస్కోన్నాడు..! అందులో నీకు వచ్చింది ఏం ఉంది??
 
ఆ తర్వాత..... రాజకీయాల్లోకి వచ్చి నీ భుజాన పార్టీ జెండా పెట్టి.... టికెట్స్ తను అమ్ముకొని సొమ్ము చేస్కోన్నాడు..... కొడుక్కి 'రోల్స్ రాయీస్' లాంటి ఖరీదైన కార్లు కొన్నాడు..... నీకు ఏం పెట్టాడు..... చేతిలో చిప్ప తప్ప..!
 
294లో ఒక 10 టికెట్స్ అయినా 3 దశాబ్దాలుగా ఆయన్ని మోస్తున్న ఫాన్స్ ప్రెసిడెంట్స్‌కి అయినా ఇచ్చడా?? లేదు డబ్బు సంచులతో ఎవడు వస్తే వాడికే ఇచ్చాడు.
 
కలెక్షన్స్ బాగా దండుకొని అంత అయ్యాక పార్టీ మూసేసి.... నన్ను అమాయకుణ్ణి చేసి ముంచేశారని మొసలి కన్నీళ్ళు కారిస్తే..... నువ్వు పెడ బొబ్బలు పెట్టావ్.... మా అన్న మంచోడు చుట్టూ చేరి ముంచేసారని..!
 
ఎన్టీఆర్‌గారు అదే సినిమా ప్రపంచం నుండి వచ్చి.... పార్టీ పెట్టి తన ఫాన్స్ ప్రెసిడెంట్స్‌గా ఉన్న శ్రీపతి రాజేశ్వర్, నెల్లూరు రమేష్ రెడ్డి, బి.వి.మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకి టికెట్స్ ఇచ్చి గెలిపించి మంత్రుల్ని చేశాడు. మరి ప్రజలు లేని ఒక రాజ్యం అనే పార్టి పెట్టినా ఆ అన్న ఏం చేసాడు??
 
ఇవ్వాళ తమ్ముడు..... ఇంకో పార్టి పెట్టి కొత్త అవతారం ఎత్తాడు. పార్టి పెట్టి.... పెట్టక ముందే ఒక మంచి ప్యాకేజీ కుదుర్చుకొని ప్రీ ప్రొడక్షన్‌లో పార్టీ ఉండగానే టేబుల్ ప్రాఫిట్ చూసాడు.
 
మహా తెలివిగలోడు. ఎంత తెలివి అంటే ఒక మనిషి తనని తిడితే మా తల్లిని తిట్టింది అని నిమ్మళంగా నాలుగు రోజులాగి దానిని రాజకీయం చేసి, మీడియా మీద బురద జల్లి దాంట్లో కొంచెం ప్రత్యర్థి పార్టీకి పూసి తను పెట్టబోయే కొత్త ఛానల్‌కి ప్రమోట్ చేస్కునేంత తెలివిగలోడు.....
 
అసలు చెప్పిన నిజాలు నీకు ఒప్పుకోవడానికి మనసొప్పదు..... సరే నేను ఒకటి అడుగుతా చెప్పు...... 30 ఏళ్లుగా నెంబర్ 1 ఉంటూ సగానికి పైగా థియేటర్స్ కంట్రోల్‌లో పెట్టుకొని సినిమా ఇండస్ట్రీలో మకుటం లేని మహారాజుగా ఉన్న ఆ పెద్ద మనిషి... ఒక్క నటుడినైనా మీ కులంలో నుండి హీరోగా రమ్మని గానీ....... వచ్చిన వాళ్ళని ఎంకరేజ్ చేయడంగానీ జరిగిందా??
 
లేదు..... ఆయన కుటుంబంలోనే డజను మందిని దింపి..... నీ భుజాన మోపాడు. ఏం మీ కులంలో ఆ కుటుంబం తప్పించి హీరోస్ అయ్యే అర్హత ఇంకెవరికి లేదా??
 
అదే సినిమా ప్రపంచంలో ఇంకో కులం కూడా ఉంది.... 3 శాతం కూడా లేని..... ఆ కులం నుండి 30 రకాల కుటుంబాలు బోలెడు డైరెక్టర్స్, బొచ్చెడు మంది హీరోస్ ఉన్నారు. మరి 30 శాతం ఉన్న మీ కులం ఉండి ఆ కుటుంబం తప్పించి ఇంకోకళ్లని ఆ కుటుంబం ఎందుకు తీసుకుని రావట్లేదు. అదే వ్యాపారం అంటే మీ కులానికి తానే ప్రతినిధిని అని చెప్పుకుంటూ చేసే మోనోపోలీ బిజినెస్ అది.
 
ఏనాడైనా మీరు బాగా చదువుకుని బాగుపడండిరా.... మా వెనుక తిరగొద్దు.... అన్నారా?
తెలుసుకో....... ఇప్పటికైనా కళ్ళు తెరువు....... టికెట్స్ కోసం సిగపట్లు పట్టి...... చిరిగినా చొక్కా తెగిన జోళ్ళు చూసుకో.
కులం మాటున చేసే ఆ బానిస మనస్తత్వం వదిలి నీ గురించి నీ కుటుంబం గురించి ఆలోచించు..... ఒళ్ళు వంచి కష్టపడు అపుడు రిజర్వేషన్ అడగాల్సిన అవసరం కూడా ఉండదు.
 
నిన్న కూడా సరిగ్గా వయసు కూడా రాని కుర్రోళ్ళు..... ఫాన్స్ పేరుతో.... టీవీ వాహనాలు పగలగొట్టారు..... ఓ వ్యక్తిని.... పోలీసు చొక్కా పట్టుకుని లాక్కెళ్లడం కూడా చూసాం.... వాళ్ళు వచ్చారా....
 
సమయం అంత ఆ కుటుంబం తీసిన సినిమాలు..... పెట్టిన పార్టీలు..... ఇచ్చిన పిలుపులకి స్పందిచటానికి ఖర్చు పెడితే నీ భార్య బిడ్డలకి ఏం తెచ్చి పెడతావ్.... ఎలా పోషిస్తావ్??
 
కొంతమంది నా ప్రాణమిత్రులు... సోదరులు.... ఫాన్స్‌గా చెప్పుకుంటూ 'క్యాస్ట్ ప్రైడ్'తో కాలర్ ఎగరేసే చాలా మందిని చూసి జాలి వేసి రాయాలి అనిపించి రాసా..! ఇక ఏం చేయదలుచుకున్నారో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం.