మంగళవారం, 5 ఆగస్టు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 23 ఏప్రియల్ 2018 (12:54 IST)

ఆడపడుచుల కోసం వీరమహిళ- పవన్ ఫ్యాన్స్‌కు శ్రీశక్తి థ్యాంక్స్.. ఆ తల్లికి పదిలక్షల?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ మీడియాపై మండిపడుతున్నారు. వరుసగా ట్వీట్లు చేస్తూ.. ఎల్లో జర్నలిజంపై ఏకిపారేస్తున్నారు. ట్విట్టర్లో మీడియాపై కన్నెర్ర చేస్తూ.. టీవీ, పేపర్ సంస్థలపై వార్ కొనసాగిస్తున్నారు. గత

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ మీడియాపై మండిపడుతున్నారు. వరుసగా ట్వీట్లు చేస్తూ.. ఎల్లో జర్నలిజంపై ఏకిపారేస్తున్నారు. ట్విట్టర్లో మీడియాపై కన్నెర్ర చేస్తూ.. టీవీ, పేపర్ సంస్థలపై వార్ కొనసాగిస్తున్నారు. 


గత ఆరు నెలలుగా తన మీద, తన ఫ్యాన్స్, స్నేహితులు, పార్టీపై దూషణలు కొనసాగిస్తున్నారు. చివరికి తన తల్లిని కూడా తిట్టారని.. ఇలా మనల్ని, మన తల్లుల్ని, ఆడపడుచుల్ని తిట్టే పేపర్లు ఎందుకు చూడాలని ప్రశ్నించారు. 
 
జర్నలిజం విలువలతో వున్న చానెల్స్, పత్రికలు, సమదృష్టి కోణంతో ఉండాలి. త్వరలోనే తెలుగు చిత్ర పరిశ్రమ ఆడపడుచుల ఆత్మగౌరవ పోరాట సమితి ఏర్పాటుకి రంగం సిద్ధమవుతుందని ప్రకటించారు. వీరికి జనసేన 'వీరమహిళ' విభాగం అండగా ఉంటుంది" అంటూ పవన్ తన ట్విట్టర్ అకౌంట్‌లో పవన్ పేర్కొన్నారు.
 
ఇదిలా ఉంటే.. కాస్టింగ్ కౌచ్‌పై పోరుబాట పట్టిన శ్రీరెడ్డి తాజాగా పవన్ ఫ్యాన్స్‌పై ట్వీట్ చేసింది. పవన్ కల్యాణ్ అభిమానులు తన పట్ల చూపించే అభిమానానికి కళ్లలో నీళ్లు తిరిగాయంటూ ఆమె ట్వీట్ చేశారు. మానవత్వం బతికే వుంది. కుటుంబానికి దూరమై ఏకాకి అయిన తనకు పవన్ ఫ్యాన్స్ కొందరు తిన్నావా అక్కా? బాగున్నావా అక్కా? అంటూ మెస్సేజ్‌లు పెడుతుంటే కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయని ట్వీట్ చేసింది. అంతేగాకుండా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు థ్యాంక్స్ చెప్పింది. 
 
అలాగే, మరో ట్వీట్‌లో త్వరలోనే తెలుగు చిత్ర పరిశ్రమలో ఆడపడుచుల ఆత్మగౌరవ పోరాట సమితి ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోందని, వీరికి జనసేన మహిళా విభాగం అండంగా ఉంటుందని పవన్ చేసిన ప్రకటనపై శ్రీశక్తి హర్షం వ్యక్తం చేసింది. 
 
పవన్ కల్యాణ్ అమ్మగారికి నా శిరస్సు వంచి పది లక్షల సాష్టాంగ నమస్కారాలు. నన్ను క్షమించండి అమ్మా. మీ చెప్పుతో కొట్టండి నన్ను. కానీ సినీ పెద్దలకు మిమ్మల్ని అంటేగానీ అర్థం కాలేదమ్మా, ఈ ఒంటరి ఆడపిల్ల బాధ. మీ ఫొటో చూసి పది లక్షల సార్లు క్షమించమని వేడుకున్నా అమ్మా'' అంటూ శ్రీరెడ్డి మరో ట్వీట్ పోస్ట్ చేశారు.