సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : ఆదివారం, 22 ఏప్రియల్ 2018 (17:48 IST)

నాకేమైనా ఐతే మెగా ఫ్యామీలీదే బాధ్యత... జగనన్నా అలా చేయకండి: శ్రీరెడ్డి

కాస్టింగ్ కౌచ్‌పై శ్రీరెడ్డి పోరుబాట పట్టిన సంగతి తెలిసిందే. తాజాగా తన అర్ధనగ్న ప్రదర్శనపై శ్రీరెడ్డి అలియాస్ శ్రీశక్తి ఓ లీక్ చేసింది. అర్ధనగ్న ప్రదర్శనకు ముందు కూడా ఓ అగ్ర దర్శఖుడు సెటిల్‌మెంట్‌కు ప

కాస్టింగ్ కౌచ్‌పై శ్రీరెడ్డి పోరుబాట పట్టిన సంగతి తెలిసిందే. తాజాగా తన అర్ధనగ్న ప్రదర్శనపై శ్రీరెడ్డి అలియాస్ శ్రీశక్తి ఓ లీక్ చేసింది. అర్ధనగ్న ప్రదర్శనకు ముందు కూడా ఓ అగ్ర దర్శఖుడు సెటిల్‌మెంట్‌కు ప్రయత్నించారంది.


ఈ మేరకు తన ఫేస్‌బుక్ ఖాతాలో బడా దర్శకుడి సెటిల్మెంట్ గురించి మా గ్రూపుకు బాగా తెలుసునని చెప్పింది. దీన్ని రాజకీయానికి వాడుకోవద్దని చెప్పింది. ఈ విషయంలో అవసరమైతే పేరు కూడా బయటపెడతా, పోరాటంలో ప్రాణాలకి తెగించానని తెలిపింది. 
 
బడాబాబులు తమ వద్దే తమ కరెన్సీ కట్టలు పెట్టుకోండని శ్రీరెడ్డి తెలిపింది. అమ్ముడు పోయే వాళ్లెవరో ప్రజలకు తెలుసు. మెగా ఫ్యామిలీ అర్థం చేసుకుంటే చాలు. రెండు వందల పిచ్చి కామెంట్స్‌ని తాము ఏమాత్రం లెక్కచేయమని శ్రీరెడ్డి చెప్పింది. తమ నిజాయితీ నిరూపించుకుంటామని.. అమ్మాయిలను తక్కువ చేసినా, వాడుకోవాలని ట్రై చేసినా.. ఒక్కొక్కడి తాట తీస్తామని శ్రీశక్తి తెలిపింది. తనకు ఏమైనా అయితే అందుకు మెగా ఫ్యామిలీనే బాధ్యత వహించాలని.. ఇప్పటికే బెదిరింపులు వస్తున్నాయని శ్రీశక్తి వెల్లడించింది.
 
ఫేస్‌బుక్‌లో వరుస పోస్టులు చేస్తున్న శ్రీరెడ్డి... తాజాగా వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డిపై కామెంట్ చేసింది. జగన్ అన్నా నీ ఉప్పు తిన్నందుకు విశ్వాసంతో వున్నానని చెప్పింది. రౌడీ రాజకీయాలను చేసే వాళ్లని కలుపుకోవద్దని సూచించింది. 
 
వైఎస్ఆర్ అన్నా, మీరన్నా జనాల్లో విపరీతమైన అభిమానం ఉందన్నా. మీ ఫ్యాన్స్ ఎంత క్రమశిక్షణగా ఉంటారు? ఎలాంటి బహిరంగసభలు, ఓదార్పు యాత్రలు చేశారు ఎంతో శాంతంగా?? ఈరోజు జగన్ అన్న తన అనుచరులని ఎవరి మీదకి ఉసిగొల్పలేదు.. దటీజ్ జగన్.. శాంతి ఓర్పు సహనం వైఎస్ ఆయుధాలు. యువతకు ఆదర్శమూర్తి'' అని శ్రీశక్తి తెలిపింది.