శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : శుక్రవారం, 13 ఏప్రియల్ 2018 (18:25 IST)

దేశ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో బీజేపీ - కాంగ్రెస్ విఫలం : కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల సారథ్యాల్లో ఉన్న ఫ్రంట్‌లకు ప్రత్యామ్నాయంగా సరికొత్త కూటమిని ఏర్పాటు చేయాలని ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల సారథ్యాల్లో ఉన్న ఫ్రంట్‌లకు ప్రత్యామ్నాయంగా సరికొత్త కూటమిని ఏర్పాటు చేయాలని ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులోభాగంగా, ఆయన శుక్రవారం మాజీ ప్రధాని దేవెగౌడతో సమావేశమయ్యారు. ఇందుకోసం ఆయన ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు వెళ్లి మాజీ ప్రధానితో మంతనాలు జరిపారు.
 
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఘోరంగా విఫలమైనయని ఆరోపించారు. జాతీయ రాజకీయాల్లో పెద్ద ఎజెండాతో ముందుకు పోతున్నట్లు.. తమది తృతీయ ఫ్రంట్ కాదని తమది ప్రజల ఫ్రంట్ అని స్పష్టంచేశారు. దేశం, రైతులను కాపాడటమే తమ అంతిమ లక్ష్యమన్నారు. 
 
స్వాతంత్ర్యం అనంతరం ఆరేళ్లు మినహా కాంగ్రెస్, బీజేపీలే దేశాన్ని పాలించాయన్నారు. వారి లోపభూయిష్టమైన విధానాలే వల్లే దేశం సమస్యలను ఎదుర్కొంటుందన్నారు. రైతులు ఇబ్బందులు పడుతున్నారని గుర్తుచేశారు. మిగులు జలాలను నిల్వచేసి రైతులకు పంపిణీ చేయలేని పరిస్థితి ఇప్పటికీ ఉన్నారన్నారు. 
 
కావేరీ జలాల సమస్యకు ఇంతవరకు పరిష్కారం దొరకలేదు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యూనల్ ఇప్పటి వరకు నీటి సమస్యకు పరిష్కారం చూపలేదు. ఏ పార్టీ కలిసి వచ్చిన కలుపుకుపోతామనీ, అంతా ఏకతాటిపై నిలిచి దేశాన్ని రైతులను కాపాడదామని పిలుపునిచ్చారు. కర్ణాటకలో ఉన్న తెలుగు ప్రజలంతా జేడీఎస్‌కు మద్దతు పలకాలని కేసీఆర్ కోరారు.