ఒకే సినిమాలో నివేదా థామస్, షాలినీ పాండే.. సెట్స్‌పైకి 25 నుంచి?
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గుహన్ దర్శకత్వంలో ఈ నెల 25వ తేదీన కొత్త సినిమా రూపుదిద్దుకోనుంది. ప్రస్తుతం కల్యాణ్ రామ్ నా నువ్వే అని సినిమాలో నటిస్తున్నాడు. తమన్నా కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ త్వర
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గుహన్ దర్శకత్వంలో ఈ నెల 25వ తేదీన కొత్త సినిమా రూపుదిద్దుకోనుంది. ప్రస్తుతం కల్యాణ్ రామ్ నా నువ్వే అని సినిమాలో నటిస్తున్నాడు. తమన్నా కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ త్వరలో పూర్తి కానుంది. జయేంద్ర దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను, వచ్చేనెల 25వ తేదీన విడుదల చేయనున్నారు.
ఈ నేపథ్యంలో కల్యాణ్ రామ్ హీరోగా గుహన్ కొత్త సినిమాను ప్రారంభించనున్నారు. ఈ సినిమాను కూడా ఈ నెల 25వ తేదీన ప్రారంభం కానుంది. ఇందులో కల్యాణ్ రామ్ సరసన నివేదా థామస్, షాలిని పాండే హీరోయిన్లుగా నటిస్తున్నారు. తెలుగులో నివేదా థామస్, షాలిని పాండేలకు మంచి క్రేజున్న నేపథ్యంలో కల్యాణ్ హీరోగా తెరకెక్కే ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.