శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 9 ఏప్రియల్ 2018 (13:22 IST)

మహేష్ బాబు 25వ సినిమాలో షాలినిపాండే.. హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిందా?

''అర్జున్ రెడ్డి'' హీరోయిన్‌కు బంపర్ ఆఫర్ లభించింది. అర్జున్ రెడ్డి చిత్రంలో షాలినీ పాండేకు మంచి క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ షూటింగ్‌లతో బిజీగా వున్న ఈ ముద్దుగుమ్

''అర్జున్ రెడ్డి'' హీరోయిన్‌కు బంపర్ ఆఫర్ లభించింది. అర్జున్ రెడ్డి చిత్రంలో షాలినీ పాండేకు మంచి క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ షూటింగ్‌లతో బిజీగా వున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు చిత్రంలో నటించే అవకాశం లభించింది. మహేష్ బాబు 25వ సినిమాలో షాలినీ పాండే నటించే అవకాశం వుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
ప్రస్తుతం మహేష్ బాబు భరత్ అనే నేను సినిమాలో నటించారు. ఈ చిత్రం ఈ నెల 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. మహేష్ బాబు తన 25వ సినిమాను వంశీ పైడిపల్లితో చేయనున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డేను ఎంపిక చేశారని తెలిసింది. 
 
అయితే భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమాలో షాలిని పాండే కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. షాలిని పాండే మాత్రమే ఆ రోల్ చేయగలదని దర్శకనిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం. దిల్ రాజు, అశ్వనీదత్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తోంది.