సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : ఆదివారం, 8 ఏప్రియల్ 2018 (19:02 IST)

''భరత్ అనే నేను'' మేకింగ్ వీడియో

టాలీవుడ్ మహేష్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం ''భరత్‌ అనే నేను''. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకను హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్

టాలీవుడ్ మహేష్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం ''భరత్‌ అనే నేను''. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకను హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ భరత్ అనే నేను థియేట్రికల్‌ టీజర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్లో డైలాగ్స్ అదుర్స్ అనిపించాయి. 
 
బ్యాక్‌గ్రౌండ్‌లో ''భరత్‌ అనే నేను'' అనే పాట సాగుతుండగా మహేష్ బాబు స్టైల్ ఆఫ్ పంచ్ డైలాగులు పేలుస్తూ టీజర్‌ను ఆకర్షణీయంగా రూపొందించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. నందమూరి తారకరామారావుగారి మనవడిని అయిన నేను, అభిమాన సోదరులందరికీ నమస్కారాలు'' అని జూనియర్ ఎన్టీఆర్ అన్నాడు. 
 
మహేష్ బాబును మీరందరూ ప్రిన్స్, సూపర్ స్టార్ అంటారు. కానీ, తాను మాత్రం మహేష్ అన్న అంటాను. ఈ వేడుకకు నేను ముఖ్యఅతిథిగా రాలేదు.. ఓ కుటుంబసభ్యుడిగా వచ్చానని చెప్పారు. తాజాగా ఈ సినిమా మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో రిలీజ్ అయ్యింది. ఆ వీడియోను ఓ లుక్కేయండి.