సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 7 ఏప్రియల్ 2018 (07:31 IST)

"రంగస్థలం" యూనిట్‌కు ఎటు చూసినా ప్రశంసలే... మహేష్ కూడా

మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్, సమంత జంటగా నటించిన చిత్రం "రంగస్థలం". సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 30వ తేదీన విడుదలైంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్

మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్, సమంత జంటగా నటించిన చిత్రం "రంగస్థలం". సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 30వ తేదీన విడుదలైంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, సి.వి.ఎం(మోహ‌న్‌) ఈ చిత్రాన్ని నిర్మించారు.
 
ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ విజయం దిశగా దూసుకుపోతుంది. ఈ సినిమాని చూసిన ప్రతి ఒక్కరూ... చిత్ర టీమ్‌ని మెచ్చుకుంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా చేరారు. "రంగస్థలం" సినిమా చూసిన మహేష్ బాబు.. చిత్ర యూనిట్‌ని మెచ్చుకుంటూ.. తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశారు.
 
"రంగస్థలం అద్భుతమైన సినిమా. సుక్కు.. చిత్రీకరణలో నీవు నిజంగా మాస్టర్‌వి. దేవిశ్రీ ప్రసాద్.. నీవు రాక్‌స్టార్ అంతే. రత్నవేలు బ్రిలియంట్ ఫొటోగ్రఫీ ఇచ్చారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు మరోసారి తమ ప్రతిభను కనబరిచారు. రామ్ చరణ్ మరియు సమంత.. మీ కెరియర్‌లోనే అద్భుతమైన నటనను కనబరిచారు. చిత్ర యూనిట్ మొత్తానికి నా అభినందనలు. రంగస్థలంతో చాలా సంతోషం పొందాను.." అంటూ మహేష్ బాబు తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. 
 
దీనికి కృతజ్ఞతగా రామ్ చరణ్ కూడా స్పందించాడు. మహేష్ బాబుకి ధన్యవాదాలు తెలుపుతూ.. థ్యాంక్యూ మహేష్.. అంటూ చరణ్ తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశారు.