శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : సోమవారం, 23 ఏప్రియల్ 2018 (15:17 IST)

మీ వేషాలు.. నాదగ్గర కుదరవ్... పబ్లిక్‌గా తిట్టారు.. ప్రైవేట్‌గా సారీ చెప్తారా?

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోమారు ట్వీట్ చేశారు. తనను, తన తల్లిని బహిరంగంగా దుర్భాషలాడి.. ఇపుడు సీక్రెట్‌గా సారీ చెపుతామంటూ ముందుకు వస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోమారు ట్వీట్ చేశారు. తనను, తన తల్లిని బహిరంగంగా దుర్భాషలాడి.. ఇపుడు సీక్రెట్‌గా సారీ చెపుతామంటూ ముందుకు వస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. పైగా, ఇలాంటివేమీ తనవద్ద కుదరవని హెచ్చరించారు. ఇటీవల పవన్‌ కల్యాణ్‌పై నటి శ్రీరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు చేయగా, అవి తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీనిపై ఇటీవల పవన్‌ ట్విటర్‌ ద్వారా స్పందించారు. అనవసరంగా టీఆర్‌పీల కోసం తన తల్లిని తిట్టారంటూ ఆయన బాధపడ్డారు. ఆ తర్వాత తన కుటుంబంతో కలిసి ఫిలిం ఛాంబర్‌లో నిరసనకు దిగారు. అప్పటి నుంచి ఆయన ట్విట్టర్ ఖాతాలో వరుస ట్వీట్స్ చేస్తూ హోరెత్తిస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో తన తల్లిని దూషించిన వారు రహస్యంగా క్షమాపణలు చెబుతున్నారని మండిపడ్డారు. 'పబ్లిక్‌లో నోటికొచ్చినట్లు తిట్టారు. ప్రైవేట్‌గా క్షమాపణలు చెబుతున్నారు. ఇలాంటివి నా దగ్గర కుదరవు. గత ఆరు నెలలుగా నన్ను, నా తల్లిని, అభిమానులను, అనుచరులను నోటికొచ్చినట్లు తిట్టారు. ఇంతటి నీచ బుద్ధి ఉన్న మీరు ఇప్పుడు రహస్యంగా క్షమాపణలు చెప్తారా? మనల్ని, మన తల్లుల్ని, ఆడపడుచులన్ని తిట్టే పేపర్లు ఎందుకు చదవాలి? వాళ్ల టీవీలు ఎందుకు చూడాలి? జర్నలిజం విలువలతో ఉన్న ఛానెల్స్‌, పత్రికలకు మద్దతిస్తాం' అని ఆయన హెచ్చరించారు.