సంబంధిత వార్తలు
- బన్నీపై నెగెటివ్ ప్రచారం : ప్రియమైన అదృశ్య శత్రువు...
- బన్నీ మూవీలో టబు... ఇంతకీ టబు లుక్ ఎలా ఉంటుందో తెలుసా..?
- అల్లు అర్జున్ మేనేజర్ పైన మండిపడ్డ సురేష్ బాబు... అసలు ఏమైంది..?
- బన్నీ- కో-డైరెక్టర్ మధ్య వివాదం... త్రివిక్రమ్ మూవీ షూటింగ్ వాయిదా...
- పూజా హెగ్డేను ప్రేమించి పెళ్లి చేసుకోవాలంటున్న అల్లు అర్జున్!
బన్నీ, సుక్కు మూవీకి ముహుర్తం కుదిరింది... ఎప్పుడో తెలుసా..?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా` సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నారు. దానికి కారణం.. సరైన కథతో సినిమా చేయాలనే. చాలా కథలు విని ఆఖరికి బన్నీ త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు బన్నీ సుకుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం.. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో `ఐకాన్ కనపడుటలేదు` అనే మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఇలా వరుసగా సినిమాలు ఓకే చెబుతున్నాడు కానీ... వరుస సినిమాలను ఎప్పటికీ పూర్తి చేస్తారోనని వార్తలు కూడా వినిపించాయి. అయితే... లేటెస్ట్‌గా బన్నీ సుకుమార్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని... ముహుర్తం కూడా పెట్టేసారని టాక్ బయటకు వచ్చింది. ఇంతకీ ముహుర్తం ఎప్పుడంటే... సెప్టెంబర్ 18న ప్రారంభం అవుతుందట. వచ్చే ఏడాది సమ్మర్‌లో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారని తెలిసింది.
మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రం ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందనుందట. మరి.. ఈ సినిమాతో ఆశించిన విజయం సాధిస్తాడో లేడో చూడాలి.
