శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 24 జులై 2019 (20:57 IST)

అల్లు అర్జున్ మేనేజ‌ర్ పైన మండిప‌డ్డ సురేష్ బాబు... అస‌లు ఏమైంది..?

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ మేనేజ‌ర్ పైన స్టార్ ప్రొడ్యూస‌ర్ సురేష్ బాబు మండిప‌డ్డారు. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో ఇదే హాట్ టాపిక్. ఇంత‌కీ మ్యాట‌ర్ ఏంటంటే... అల్లు అర్జున్ ప్ర‌స్తుతం మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో షూటింగ్ జ‌రుపుకుంటుంది. అయితే... కో-డైరెక్ట‌ర్ ఓ రోజు బ‌న్నీతో ఈ రోజు నుంచి ఓ రెండు మూడు రోజులు షూటింగ్ లేద‌ని చెప్పాడ‌ట‌. అంతే బ‌న్నీకి ఎప్పుడూ రానంత కోపం వ‌చ్చింద‌ట‌. 
 
కో డైరెక్ట‌ర్ పైన ఫైర్ అవ్వ‌డం.. అత‌ను బాగా సీనియ‌ర్ కో డైరెక్ట‌ర్ కావడంతో అతడు ద‌ర్శ‌కుల సంఘంలో ఫిర్యాదు చేద్దాం అనుకునేంత వ‌ర‌కు వెళితే అల్లు అర‌వింద్ ఎంటరై గొడ‌వ‌ను స‌ద్దుమ‌ణిగేలా చేసార‌ట‌. ఇదంతా ఓకే.. మ‌రి.. అల్లు అర్జున్ మేనేజ‌ర్ పైన సురేష్ బాబు ఎందుకు మండిప‌డ్డారంటారా...?
 
విష‌యం ఏంటంటే... ఆ కో డైరెక్ట‌ర్‌కి, కొంతమంది మీడియా వ్య‌క్తుల‌కు అల్లు అర్జున్ మేనేజ‌ర్ కోపం అవ్వ‌డం వెన‌కున్న అస‌లు నిజం చెప్పాడ‌ట‌. అది ఏంటంటే... బ‌న్నీకి బాగా క్లోజ్ ఫ్రెండ్ అయిన రానాకి అమెరికాలో కిడ్నీ ఆప‌రేష‌న్ జ‌రుగుతోంది. ఈ టైమ్‌లో అక్క‌డ ఉండాల‌నుకున్నాడు. షూటింగ్ ఉండ‌డం వ‌ల‌న వెళ్ల‌లేదు. ఇప్పుడు షూటింగ్ క్యాన్సిల్ అని చెప్పారు. 
 
ఇదేదో ముందే చెప్పుంటే రానా ద‌గ్గ‌ర‌కి వెళ్లేవాడు క‌దా. ఆ బాధ‌తోనే సీరియ‌స్ అయ్యాడ‌ని చెప్పాడ‌ట‌. ఈ విష‌యం మీడియాలో వ‌చ్చింది. ఈ విధంగా బ‌న్నీ మేనేజ‌ర్ వ‌ల్ల‌నే రానాకి ఆప‌రేష‌న్ అనే విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింద‌ని సురేష్ బాబు బాగా సీరియ‌స్ అయ్యార‌ట‌. అదీ..సంగ‌తి.