సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: బుధవారం, 17 జులై 2019 (18:01 IST)

పవనా...? ఈ పని మీకు తగునా...? ఎవరు?

జనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు వామపక్షాలతో కలిసి చేసిన హడావిడి అంతాఇంతా కాదు. ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందన్న ప్రచారమూ బాగానే సాగింది. మరికొందరైతే ఏకంగా పవన్ కళ్యాణ్ కింగ్ మేకర్ అవుతారని కూడా అనుకున్నారు. కానీ అంతా రివర్సయ్యింది. ఒకే ఒక్క ఎమ్మెల్యే మాత్రమే జనసేన పార్టీ తరపున గెలిచారు.
 
దీంతో వామపక్షాలు, జనసేన పార్టీ నేతలు నిరుత్సాహానికి గురయ్యారు. కొన్నిరోజుల పాటు ఇరువురు సైలెంట్ అయిపోయారు. అయితే తాజాగా జనసేనాని తీసుకుంటున్న నిర్ణయాలపై వామపక్షాలు కన్నెర్ర చేస్తున్నాయట. ఎన్నికలకు ముందు తమతో పాటు కలిసి ఉండి ఉన్నట్లుండి బిజెపిలోకి వెళ్ళిపోవాలని పవన్ నిర్ణయించుకోవడమే ఇందుకు కారణమట.
 
ముందు నుంచి వామపక్షాలు నరేంద్రమోడీని వ్యతిరేకిస్తున్నాయి. ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న మోడీపై దుమ్మెత్తి పోస్తున్నాయి. ఇలాంటి సమయంలో తమతో పాటు స్నేహభావంతో ఉన్న పవన్ కళ్యాణ్‌ మోడీతో కలవడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి వామపక్షాలు. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నించేందుకు కూడా సిద్ధమైపోయారట వామపక్షాలు. మరి పవన్ కళ్యాణ్ రాజకీయ స్నేహితులకు ఏవిధంగా సమాధానం చెప్పి బుజ్జగిస్తారో వేచి చూడాల్సిందే.