గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Updated : శుక్రవారం, 5 జులై 2019 (18:28 IST)

శభాష్.. పవన్ కళ్యాణ్.. నీ అభిమానిగా గర్వపడుతున్నాం.. (video)

తాజాగా జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ ఓటమి పాలైనా పవన్ కళ్యాణ్ మాత్రం తన సేవా హృదయాన్ని చాటుకుని శభాష్ పవన్ కళ్యాణ్ అనిపించుకున్నారు. సహాయం కోసం ఎవరు కళ్యాణ్‌ను సంప్రదించినా వీలైనంత సహాయం చేస్తుంటారు పవన్. సినీ పరిశ్రమ, స్వచ్చంద సంస్థల వ్యక్తులు, అభిమానులు, తన పార్టీ కార్యకర్తలకు అనేక మందికి నేనున్నానంటూ భరోసా ఇచ్చిన కళ్యాణ్ తాజాగా మరో ఇద్దరు అభిమానులకు అండగా నిలబడ్డారు. 
 
విజయనగరం జిల్లాకు చెందిన విశ్వతేజ అనే కార్యకర్త క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడని సన్నిహితులు ద్వారా తెలుసుకున్న జనసేనాని వెంటనే వైద్య ఖర్చుల నిమిత్తం అతనికి రెండు లక్షల సహాయం చేశారు. అలాగే అనారోగ్యంతో మంచానికి పరిమితమైన ఖమ్మం జిల్లాకు చెందిన గుబ్బాల సతీష్ అనే యువకుడికి కూడా తన సిబ్బంది ద్వారా లక్ష రూపాయల చెక్ అందజేశారు. 
 
తన అభిమాన నటుడు, నాయకుడు నుంచి సాయం లభించినందుకు సతీష్, విశ్వతేజల ఆనందానికి అవధులు లేవు. పవన్ కళ్యాణ్ అభిమానులుగా గర్వపడుతున్నామని తెలియజేశారు వీరిరువురు.