సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 1 జులై 2019 (12:35 IST)

ఆర్థిక కష్టాల్లో పవన్ కళ్యాణ్ హీరోయిన్... హీరో ఆదుకునేనా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించిన హీరోయిన్ అమీషా పటేల్. వీరిద్దరూ కలిసి "బద్రి" చిత్రంలో నటించారు. ప్రస్తుతం ఈమె పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్నారు. ఓ ఫైనాన్షియర్ తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేక పోయింది. దీంతో ఆయన కోర్టు ద్వారా నోటీసులు జారీచేశారు. ఈ కేసు ఈ నెల 8వ తేదీన విచారణకు రానుంది.
 
అమీషా పటేల్‌కు సినీ అవకాశాలు తగ్గిపోవడంతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. ఈమె "దేశీ మ్యూజిక్" పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించారు. 2013లో ప్రారంభమైన ఈ చిత్రం అనేక కారణాలతో ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు. అయితే, ఈ చిత్రం కోసం అజయ్ కుమార్ సింగ్ అనే ఫైనాన్షియర్ వద్ద నుంచి అమీషా పటేల్ రూ.3 కోట్ల మేరకు అప్పు తీసుకుంది. 
 
ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించలేక పోయింది. దీంతో ఫైనాన్షియర్ కోర్టు ద్వారా ఆమెకు నోటీసులు జారీచేశారు. ఈ కేసు విచారణ ఈ నెల 8వ తేదీన విచారణకు రానుంది. ఒక వేళ ఈ కేసు విచారణకు ఆమె హాజరుకానిపక్షంలో నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీచేస్తామని కోర్టు హెచ్చరించింది.