శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 30 జూన్ 2019 (15:04 IST)

ఎస్వీ రంగారావు పేరుతో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తన సారథ్యంలోని జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఓ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌ను నెలకొల్పనున్నట్టు ఆ పార్టీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ఇనిస్టిట్యూట్‌కు తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన దిగ్గజ నటుడు ఎస్వీ రంగారావు పేరు పెట్టనున్నట్టు పేర్కొన్నారు.
 
ఈ శిక్షణా కేంద్రాన్ని పాలకొల్లులో ప్రారంభించనున్నారు. దీనికి పవన్ కల్యాణ్ త్వరలోనే ప్రారంభిస్తారు. అల్లు రామలింగయ్య, దాసరి నారాయణరావు, కోడి రామకృష్ణ వంటి ఎందరో ఉద్దండులను సినీ రంగానికి అందించిన ఘనత పాలకొల్లుకు దక్కుతుందని ప్రకటనలో పేర్కొంది. 
 
రాజా వన్నెంరెడ్డి, బన్నీ వాసుల నేతృత్వంలో నడిచే ఈ ఇన్‌స్టిట్యూట్‌కి హరిరామజోగయ్య ఛైర్మన్‌ కాగా, రాజా వన్నెంరెడ్డి ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తారు. శిక్షణ విధానం, ఫ్యాకల్టీ సిద్ధంగా ఉందని.. నటన, దర్శకత్వ విభాగాల్లో శిక్షణ ఇవ్వనున్నట్టు జనసేన ఓ ప్రకటనలో పేర్కొంది.