బన్నీ- కో-డైరెక్టర్ మధ్య వివాదం... త్రివిక్రమ్ మూవీ షూటింగ్ వాయిదా...
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ చిత్రం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాని గీతా ఆర్ట్స్- హారిక- హాసిని క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. సెట్లో బన్నీ కో-డైరెక్టర్ మధ్య గొడవ జరిగింది అనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకీ ప్రచారంలో ఉన్న ఈ వార్త నిజమేనా..? అసలు ఏం జరిగింది..?
ఈ గొడవ గురించి ఆరా తీస్తే... బన్నీకి కో-డైరెక్టర్ వచ్చి మూడు రోజులు షూటింగ్ లేదని చెప్పాడట. అంతే... బన్నీకి కోపం వచ్చి సీరియస్ అయ్యాడట. విషయం ఏంటంటే.. బన్నీ అమెరికా వెళ్లాలి అనుకున్నాడట. కానీ.. షూటింగ్ ఉందని క్యాన్సిల్ చేసుకున్నాడట. దీంతో అసలు ఆ టైమ్‌లో షూటింగ్ లేదని చెప్పడంతో... కో-డైరెక్టర్ పైన సీరియస్ అయ్యాడట. ఆ కో-డైరెక్టర్ బాగా సీనియర్ అట. ఈ విషయాన్ని దర్శకుల సంఘంలో ఫిర్యాదు చేయాలి అనుకున్నాడట.
కానీ... అల్లు అరవింద్ ఈ విషయాన్ని అంతదూరం వెళ్లకుండా కామ్ చేసారని తెలిసింది. అయితే... అలా అలా ఈ గొడవ గురించి మీడియాకి తెలియడంతో వార్తలు రావడం.. హాట్ టాపిక్ అవ్వడం జరిగింది. కూల్‌గా ఉండే బన్నీ... టెక్నీషియన్ మీద ఇలా సీరియస్ అవ్వడం ఏం బాగాలేదు అంటూ మిగిలిన టెక్నీషియన్స్ అరవింద్ గారి దృష్టికి తీసుకువచ్చారట. అదీ.. మ్యాటర్..!