శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: శనివారం, 22 జూన్ 2019 (14:32 IST)

అల్లు అర్జున్ అన్న పెళ్లికొడుకాయెనే... అల్లు వారి ఇంట వివాహ వేడుక(ఫోటోలు)

సినీ నిర్మాత అల్లు అరవింద్ పెద్ద కుమారుడు, అల్లు అర్జున్ అన్న బాబీ వివాహం హైదరాబాద్ లోని  ఐటిసి కోహినూర్ హోటల్లో జరిగింది. అతి కొద్దిమంది అతిథులు మాత్రమే ఈ వివాహానికి హాజరయ్యారు. 
 
అల్లు కుటుంసభ్యులతో పాటు చిరంజీవి సతీమణి సురేఖ, రామ్ చరణ్ కూడా హాజరయ్యారు. అల్లు అర్జున్ సోదరుడు అల్లు బాబీ వివాహమాడిన అమ్మాయి పేరు నీలు. 
 
ఈమె సింబాయిసిస్ నుంచి పుణెలో ఎంబీఎ చేశారు. యోగా థెరపీలో మాస్టర్ చేసిన నీలు ఒక ప్రముఖ వ్యాపారవేత్త కమల్ కాంత్ కుమార్తె. ముంబైకి చెందిన ఈమె హైదరాబాద్‌లో యోగా సెంటర్, స్టూడియో నిర్వహిస్తోంది.