మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 28 జులై 2019 (15:20 IST)

బన్నీపై నెగెటివ్ ప్రచారం : ప్రియమైన అదృశ్య శత్రువు...

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున‌పై గత కొంతకాలంగా దుష్ప్రచారం సాగుతోంది. దీనికి అల్లు అర్జున్ పీఆర్వో ఫుల్‌స్టాఫ్ పెట్టే ప్రయత్నం చేశాడు. ప్రియమైన అదృశ్య శత్రువు అంటూ ఎస్కేఎన్ ఓ ట్వీట్ చేశారు. 
 
"ప్రియ‌మైన అదృశ్య శ‌త్రువు.. 18 ఏళ్ళుగా ఎంతో క‌ష్ట‌ప‌డి ఆయ‌న సంపాదించుకున్న స్టార్ ఇమేజ్‌ని నెగెటివ్ ఆర్టిక‌ల్స్ డ్యామేజ్ చేయ‌లేవు. అత‌ని అంకిత భావం, సాయం చేసే మ‌న‌స్థ‌త్వం అభిమానుల‌కి మ‌రింత చేరువ చేస్తుంది. ఈ పోటీలో చివరికి ఎవ‌రు విజ‌యం సాధిస్తారో చూద్దాం. ప్ర‌స్తుతం బ‌న్నీ 19వ సినిమా చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. ఇదే స‌మ‌యంలో ఆయ‌న 20, 21 చిత్రాలు ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటున్నాయి అని ఎస్కేఎన్ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.
 
నిజానికి బన్నీ గంగోత్రి చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరో రేంజ్‌ను సొంతం చేసుకున్నాడు. చివ‌రిగా "నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా" అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన బ‌న్నీ ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 19వ చిత్రం చేస్తున్నాడు. 
 
ఈ సినిమాతో పాటు దిల్ రాజు బ్యానర్‌లో వేణు శ్రీరామ్ తెర‌కెక్కిస్తున్న "ఐకాన్" అనే చిత్రం చేస్తున్న‌ట్టు తెలుస్తుంది. వీటి తర్వాత సుకుమార్‌తో ఓ చిత్రం, బోయ‌పాటితో ఓ చిత్రం చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. దాదాపు సంవ‌త్స‌రం వ‌ర‌కు సైలెంట్‌గా ఉన్న బ‌న్నీ వ‌రుస ప్రాజెక్ట్‌ల‌ని లైన్‌లో పెట్టాడు. 
 
కానీ, గత కొన్ని రోజులుగా బన్నీపై దుష్ప్రచారం సాగుతోంది. షూటింగ్ స‌మ‌యంలో కో డైరెక్ట‌ర్‌పై చేయి చేసుకున్నాడ‌నీ, ఆయన కార్‌వ్యాన్‌కి బ్లాక్ ఫిలిం ఉండ‌డంతో పోలీసులు ఫైన్ వేశారనీ, తాజాగా బ‌న్నీ డిమాండ్స్ వ‌లన నిర్మాత‌లు చాలా ఇబ్బంది ప‌డుతున్నార‌ంటూ ఇలా అనేక నెగెటివ్ వార్తలు ప్రచురించారు. వీటిపై ఎస్కేఎన్ క్లారిటీ ఇచ్చారు.