సంబంధిత వార్తలు
- సిద్ధార్థ్ మల్హోత్రా జోడీగా 'మిషన్ మజ్ను'తో రష్మికా మందన్న బాలీవుడ్ ఎంట్రీ
- అయ్యా శ్రీకాంత్ రెడ్డి, అమరనాథరెడ్డి.. శ్రీవారి దగ్గర మీకు రూల్స్ వర్తించవా?
- గల్ఫ్ దేశాలు విమానాల ఆపివేత.. ప్రవాస భారతీయులకు తలనొప్పి
- తమిళ రాజకీయాల్లోకి మరో హీరో : ఫ్యాన్స్ కల సాకారం చేయనున్న 'దళపతి'
- బిగ్ బాస్ హౌస్లోకి ఎలిమినేట్ కంటెస్టెంట్స్.. పులిహోర చేయాలంటే..? (video)
ఎన్టీఆర్ను దూరం పెడుతున్నారా? ఆయన ఎక్కడా కనిపించట్లేదే..?!
టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ ఫ్యాన్సును నిరాశపరుస్తున్నారని ఫిలిమ్ నగర్ వర్గాల టాక్. ఎందుకంటే..? ఇటీవల ప్రముఖ నిర్మాత దిల్ రాజు 50వ పుట్టినరోజు వేడుకకు తెలుగు తారలు మహేష్, ప్రభాస్, చిరంజీవి, నాగచైతన్య, సమంతా, పూజా హెగ్డే ఇలా అందరూ వచ్చారు. కానీ వారిలో ఎన్‌టీఆర్ మాత్రం కనిపించలేదు. దాని తరువాత నందమూరి జయకృష్ణ కుమారుడు చైతన్య కృష్ణ పెళ్లిలో కూడా ఎక్కడా ఎన్‌టీఆర్ కనిపించలేదు.
ఈ పెళ్లికి బాలకృష్ణ దంపతులు వీచ్చేశారు. కళ్యాణ్ రామ్ కూడా సతీసమేతంగా ఈ పెళ్లికి హాజరయ్యాడు. దీంతో తారక్ వేడుకలకు ఎందుకు దూరంగా ఉంటున్నాడని అందరిలో అనుమానాలు రేకెత్తుతున్నాయి.
అయితే ఎన్‌టీఆర్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలోని కొత్త గెటప్ అందరికి తెలిపోతుందని అలా చేస్తున్నాడని కొందరు అంటే మరి కొందరు నందమూరి కుటుంబంలోని వారు ఎన్‌టీఆర్‌ను దూరం పెడుతున్నారని అంటున్నారు. అయితే దీనికి సరైన సమాధానం అయితే తెలియదు కానీ, ఎన్‌టీఆర్ ఇలా పార్టీలకు దూరంగా ఉండటం అభిమానులకు నిరాశను కలిగిస్తోంది. మరి ఫ్యాన్స్ కోసం ఎన్టీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.
