శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 22 డిశెంబరు 2020 (08:05 IST)

గల్ఫ్‌ దేశాలు విమానాల ఆపివేత.. ప్రవాస భారతీయులకు తలనొప్పి

గల్ఫ్ దేశాలు కొత్త స్ట్రెయిన్‌ వ్యాప్తి కారణంగా ముందస్తు జాగ్రత్తగా సరిహద్దులను మూసివేస్తున్నాయి. ఇంకా అంతర్జాతీయ విమానాలను నిలిపివేస్తున్నాయి. వారం రోజుల వరకూ తమ దేశ సరిహద్దులను మూసివేస్తున్నట్టు సౌదీ అరేబియా, ఒమాన్‌ ప్రకటించగా.. పది రోజుల పాటు సరిహద్దులను మూసివేస్తున్నట్లు కువైత్‌ వెల్లడించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ ఆ దేశాల నుంచి ఎయిరిండియా విమానాలన్నీ రద్దు చేస్తున్నట్లు ఆ సంస్థ మేనేజర్‌ మొహమ్మద్‌ ఫయాజ్‌ తెలిపారు. దీంతో గల్ఫ్‌ దేశాల నుంచి మాతృదేశానికి వెళ్లలేక పలువురు ప్రవాస భారతీయులు, తెలుగువారు చిక్కుకుపోయారు.
 
కరోనా నేపథ్యంలో ఈ ఏడాది మార్చి నుంచి సౌదీ అరేబియా, కువైత్‌ దేశాలు భారత్‌ నుండి నేరుగా విమానాలను అనుమతించట్లేదు, ప్రత్యేక ఒప్పందాల ద్వారా ఈ దేశాల నుంచి భారత్‌కు విమానాలు నడుస్తున్నప్పటికీ.. భారత్‌ నుంచి నేరుగా రావడం పై మాత్రం నిషేధం ఉంది. దీంతో సౌదీ మరియు కువైత్‌ దేశాలకు రావాలనుకుంటున్న తెలుగువారు 14 రోజులు దుబాయి లేదా మస్కట్‌లో గడిపి అక్కడి నుండి వస్తున్నారు. 
 
ఈ  క్రమంలోనే.. హైదరాబాద్‌, చెన్నై నుంచి దుబాయికి చేరుకుని, 14 రోజులు గడిపిన వందలాది మంది తెలుగువారు.. కువైత్‌, సౌదీ అరేబియాకు చేరుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. వారంతా సౌదీ, కువైత్‌ నిర్ణయాలతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.