సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 21 డిశెంబరు 2020 (20:02 IST)

గంగవ్వకు ఇల్లు కట్టిస్తున్న నాగార్జున.. (video)

బిగ్ బాస్ నాలుగో సీజన్ ముగిసింది. ఫినాలే సందర్భంగా కంటిస్టెంట్స్‌పై వరాల జల్లు కురిపించారు హోస్ట్ టాలీవుడ్ మన్మధుడు నాగార్జున. దానిలో భాగంగా యూట్యూబ్ స్టార్ గంగవ్వకి తాను ఇచ్చిన మాటని నిలుపుకుంటున్నానని చెప్పారు. నాగార్జున సార్ చెప్పినట్లే తనకు ఇల్లు కట్టిస్తున్నాడని గంగవ్వ స్వయంగా బిగ్ బాస్4 గ్రాండ్ ఫినాలేలో తెలియజేసింది.

మై విలేజ్ షో కార్యక్రమంతో ఫుల్ ఫేమ్ తెచ్చుకున్న గంగవ్వ ఈ సీజన్‌లో బిగ్ బాస్ హౌజ్‌లోకి కంటెస్టెంట్‌గా వెళ్లి అందరిని ఆశ్చర్యపరిచింది. నాలుగు వారాలు ఇంట్లో బాగానే ఉన్న గంగవ్వ అక్కడి పరిస్థితులకి ఇమడలేక బయటకు వచ్చేసింది.
 
అయితే బయటికి వెళ్ళే ముందు తనకొక కోరిక ఉందని నాగార్జునకు చెప్పింది. ఇల్లు కట్టివ్వండి అని గంగవ్వ నోరు తెరిచి అడగడంతో ఆ బాధ్యతను భుజాన వేసుకున్న నాగార్జున తప్పక చేస్తానని హామీ ఇచ్చాడు. ఆ హామీ ప్రకారం ఇల్లు కూడా కట్టిస్తున్నాడు. ఈ విషయాన్నిగంగవ్వ ఫినాలే రోజు చెప్పుకొచ్చింది ఎలా ఉన్నావు గంగవ్వ, బిగ్ బాస్ తర్వాత నీ జీవితం ఎలా ఉంది అని నాగార్జున అడగగా, దానికి సమాధానం ఇచ్చిన గంగవ్వ.. ఇంతక ముందు చాలా తక్కువ మంది కలవడానికి వచ్చే వాళ్లు. ఇప్పుడు కార్లు వేసుకొని వందల మంది వస్తున్నారు. ఫొటోలు దిగుతున్నారు. అందరితో మాట్లాడలేక నా గొంతు పోతుంది అని చెప్పుకొచ్చింది.
 
అంతేకాదు తన ఇంటి కల నెరవేరిందని చెబుతూ పెద్దన్న బిగ్ బాస్, చిన్నన్న నాగార్జునకు కృతజ్ఞతలు తెలిపింది. ముగ్గు పోసిన, కొన్నాళ్ళలో అయిపోతుందని వెల్లడించింది. అంతేనా గంగవ్వ ఇంటి పనులకి సంబంధించి వీడియోని ఫినాలే రోజు ప్లే చేసి చూపించడం విశేషం.ఇక మహర్షి ఫేం దివికి బంపర్ ఆఫర్ ఇచ్చారు చిరంజీవి. మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం రీమేక్ చేయనున్నట్టు ప్రకటిస్తూ అందులో దివికి మంచి రోల్ ఇస్తామని హామీ ఇచ్చారు. మనం వేదాళం రీమేక్ చిత్రీకరణ సమయంలో కలుద్దాం అనే సరికి ఆ అమ్మడి ముఖంలో ఆనందం వెల్లివిరిసింది.
 
ఇక సోహైల్‌కి ఊహించని గిఫ్ట్ ఇచ్చారు చిరు. నా సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా రావాలి సర్ అంటే గెస్ట్ కాదు, నీ సినిమాలో కామియో రోల్ చేస్తానని చెప్పి అందరిబంధువు అనిపించాడు. ఇక నాగార్జున కూడా తన పెద్ద మనసు చాటుకున్నాడు. తనకు వచ్చిన రూ. 25 లక్షలలో అనాథశ్రమానికి రూ.5 లక్షలు మెహబూబ్ ఇంటి కోసం రూ.5 లక్షలు ఇస్తాననడంతో అవి మీరు ఇంటికి తీసుకెళ్లండి. ఆ అనాథశ్రమానికి రూ. 10 లక్షలు నేనే ఇస్తానని చెప్పి వారి మనసులలో ఆనందం నింపారు.