మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: శుక్రవారం, 18 డిశెంబరు 2020 (18:49 IST)

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకు గెస్ట్ ఎవరో తెలుసా?

మరో మూడురోజుల్లో బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే జరుగనుంది. 19మంది సభ్యుల్లో అరియానా గ్లోరీ, దేత్తడి హారిక, అఖిల్ సార్థక్, అభిజిత్ సయ్యద్, సోహెల్ రియాన్ లు మాత్రమే ఇప్పుడు ఉన్నారు. వీరు టాప్ 5లో  ఉన్నారు. వీరిలో విజయం ఎవరిని వరిస్తుందన్నది ఇప్పుడు హాట్ టాపిక్. 
 
బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే అంటే ఎంతో స్పెషల్ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనకరలేదు. ఇప్పటివరకు జరిగిన మూడు ఫినాలేలలో మొదటి దానికి హోస్ట్ ఎన్టీఆర్ తప్ప ఇంకెవరూ రాలేదు. కానీ రెండో సీజన్ లో మాత్రం విక్టరీ వెంకటేష్ వచ్చారు. మూడులో సీజన్ లో మెగాస్టార్ చిరంజీవి వచ్చారు. 
 
ఇక నాలుగవ సీజన్ లో కూడా మెగాస్టార్ రాబోతున్నారట. ఇప్పటికే ఆయనతో బిగ్ బాస్ యాజమాన్యం సంప్రదింపులు కూడా జరిపిందట. గెస్ట్ ఎవరిని సెలక్ట్ చేస్తారో.. ఎవరు గెలవబోతున్నారో అన్నది మాత్రం హాట్ టాపిక్‌గా మారుతోంది.