సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 21 డిశెంబరు 2020 (11:20 IST)

ఇట్స్ అఫీషియల్ : పవన్ - రానా మల్టీస్టారర్ మూవీ ఖరారు

తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన హీరోల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతాకాదు. ఆయన పేరు చెబితేనే ఫ్యాన్స్ కేరింతల్లో మునిగితేలుతారు. అలాగే, రానా దగ్గుబాటి కూడా. 
 
రెండేళ్ళ త‌ర్వాత రీఎంట్రీ ఇచ్చిన ప‌వ‌న్ క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు. ఇక బాహుబ‌లి సినిమాతో ఫుల్‌క్రేజ్ పొందిన రానా ప్ర‌స్తుతం పాన్ ఇండియా సినిమాలే ఎక్కువ‌గా చేస్తున్నాడు. వీరిద్ద‌రు క‌లిసి మ‌ల‌యాళ చిత్రం ‘అయ్య‌ప్ప‌నుమ్ కోశియుమ్‌’ రీమేక్ సినిమాల్లో న‌టించ‌నున్నార‌ని కొద్ది రోజులుగా జోరుగా ప్ర‌చారం జ‌రుగుతుంది. ఈ ప్రచారం ఇపుడు నిజమైంది. 
 
ఇదే అంశంపై చిత్ర నిర్మాణ సంస్థ ఓ అధికారిక ప్రకటన చేసింది. సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై అయ్య‌ప్ప‌నుమ్ కోశియుమ్‌’ రీమేక్ తెర‌కెక్క‌నుండ‌గా, ఇందులో రానా న‌టిస్తున్నాడు అంటూ మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. దీనిపై సంతోషం వ్య‌క్తం చేసిన రానా షూటింగ్‌లో పాల్గొనేందుకు చాలా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నా అని ట్వీట్ చేశారు.
 
కాగా, జ‌న‌వ‌రి మొద‌టి వారం నుండి సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ఉంటుంద‌ని అంటున్నారు. మలయాళంలో పృధ్వీరాజు సుకుమారన్ నటించిన పాత్రలో రానా న‌టించ‌నున్నాడు. ఆయ‌న స‌ర‌స‌న నివేధా క‌థానాయిక‌గా న‌టించే అవ‌కాశం ఉంది. ఈ చిత్రం కోసం పవన్ కళ్యాణ్ సుమారు నెలన్నర రోజుల పాటు తన డేట్స్‌ను కేటాయించినట్టు సమాచారం.