సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 15 డిశెంబరు 2020 (10:03 IST)

త్వరలోనే పవన్ సత్తా ఏంటో చూస్తారు : బోనీ కపూర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం వకీల్ సాబ్. బాలీవుడ్ చిత్రం పింక్‌కు రీమేక్. బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీకపూర్ సమర్పకుడిగా, టాలీవుడ్ ఏస్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం. వేణూ శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది.
 
అయితే, ఈ చిత్రానికి సంబంధించిన ఏ ఒక్క అప్‌డేట్ వచ్చినా అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్లు ఇలా ప్రతిదీ వైరల్‌గా మారిన విషయం తెల్సిందే. 
 
అయితే, ఇపుడు పవన్ సత్తా ఏంటో తెలిసింది. 'వకీల్ సాబ్' సినిమా విడుదలకు ముందే సోషల్ మీడియాలో హవా సాగిస్తోంది. ఈ చిత్ర సమర్పకుడు బోనీ కపూర్ మంగళవారం ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. 
 
'వకీల్ సాబ్' చిత్రం 2020లో అత్యధిక ట్వీట్లతో రికార్డు సృష్టించిందని వెల్లడించారు. త్వరలోనే పవర్ సత్తా ఏంటో చూస్తారని పేర్కొన్నారు. 'పింక్' చిత్రంలో అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్రను 'వకీల్ సాబ్'లో పవన్ పోషిస్తున్న విషయం తెల్సిందే.