గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: బుధవారం, 23 డిశెంబరు 2020 (17:08 IST)

అయ్యా శ్రీకాంత్ రెడ్డి, అమరనాథరెడ్డి.. శ్రీవారి దగ్గర మీకు రూల్స్ వర్తించవా?

తిరుమల వేంకటేశ్వరస్వామి అంటే భక్తి. ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకుని దర్సనం చేసుకుంటూ ఉంటారు. పేద, మధ్య, ధనిక, వృద్ధులు అనే తేడా లేకుండా స్వామివారిని దర్సించుకుంటూ ఉంటారు.
 
అయితే అధికారంలోఉన్నా, లేకున్నా సరే దేవుడంటే భయం, భక్తి ఉండాలి. కానీ అధికార వైసిపి పార్టీ నేతలకు అదంతా ఏమీ లేదంటూ మండిపడుతున్నారు ప్రతిపక్షపార్టీ నేతలు. ఇంతకీ ఇదంతా జరగడానికి అసలు కారణం ఆగమశాస్త్ర, టిటిడి నిబంధనలను వైసిపి నేతలు గాలికొదిలేయడమే.
 
తిరుమల శ్రీవారిని దర్సించుకోవడానికి నిన్న తిరుమలకు వచ్చారు ప్రభుత్వ విప్ శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డిలు. పాదయాత్రగా వారు తిరుమలకు చేరుకున్నారు. అయితే ఇప్పటికే టోకెన్లు ఉన్న వారిని మాత్రం తిరుమలకు అనుమతిస్తున్నారు.. మిగిలిన ఎవరినీ అనుమతించలేదు.
 
కానీ ఇద్దరూ వైసిపి నేతలు కావడంతో వారి వెంట 3 వేలమంది వైసిపి కార్యకర్తలు కూడా వచ్చారు. టిక్కెట్లు లేకుండానే వారు శ్రీవారిని దర్సించేసుకున్నారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు బిజెపి నేతలు. టోకెన్లు లేక భక్తులు రోడ్డుపై పడిగాపులు కాస్తుంటే వైసిపి నేతలకు మాత్రం రాజమార్గాన్ని వేస్తారా అంటూ బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు.