శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: గురువారం, 29 అక్టోబరు 2020 (14:58 IST)

ఆర్ఆర్ఆర్‌లో అది వివాదమే కాదు: సాయిమాధవ్ బుర్రా

టాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న సంచలన చిత్రం ఆర్ఆర్ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - దర్శకధీరుడు రాజమౌళి.. ఈ ముగ్గురి కాంబినేషన్లో రూపొందుతోన్న ఈ భారీ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే... ఇటీవల రిలీజ్ చేసిన తారక్ పాత్రకు సంబంధించిన వీడియో రిలీజ్ అయినప్పటి నుంచి వివాదస్పదం అవ్వడం తెలిసిందే.
 
ఇందులో కొమరం భీమ్ పాత్రను పోషిస్తున్న ఎన్టీఆర్‌ను, టీజర్ చివర్లో ముస్లిం గెటప్‌లో చూపించారు. దీనిపై ఆదివాసీలతో పాటు, అదిలాబాద్ ఎంపీ సైతం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
 
 రోజురోజుకు ఈ వివాదంపై ఎవరో ఒకరు స్పందిస్తున్నారు కానీ... ఈ వివాదం గురించి దర్శకుడు రాజమౌళి మాత్రం స్పందించడం లేదు. అయితే... ఒకరు మాత్రం ఈ వివాదం గురించి స్పందించారు.
 
ఆయనే సంభాషణల రచయిత సాయిమాధవ్ బుర్రా. ఆయన ఈ చిత్రానికి మాటల రచయితగా పని చేస్తున్నారు. ఇంతకీ ఈ వివాదంపై  సాయిమాధవ్ ఏమన్నారంటే.... ప్రస్తుతం అంతా కాంట్రవర్సీ అనుకుంటున్న అంశం, అసలు వివాదమే కాదంటున్నాడు సాయిమాధవ్. అంతకుమించి స్పందించడానికి అంగీకరించని ఈ డైలాగ్ రైటర్.. సినిమా చూస్తే ఈ విషయం అందరికీ అర్థమౌతుంది అంటున్నారు.
 
రాజమౌళి స్పందిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. మరి.. జక్కన్న ఈ వివాదంపై స్పందిస్తారో లేక మౌనం వహిస్తారో చూడాలి.