గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 28 అక్టోబరు 2020 (11:50 IST)

సీరియస్‌గా ఆలోచనలో పడ్డ జక్కన్న, ఇంతకీ ఏమైంది..?

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ల క్రేజీ కాంబినేషన్లో రూపొందుతోన్న ఆర్ఆర్ఆర్ మూవీని భారీ చిత్రాల నిర్మాత డి.వి.వి దానయ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. రామ్ చరణ్‌ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తుంటే... ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్ర పోషిస్తున్నారు.
 
అయితే.. కొమరం భీమ్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ వీడియో రిలీజ్ చేసారు. ఈ వీడియోపై విమర్శలు వస్తున్నాయి. కొమరం భీమ్ పాత్ర పోషించిన ఎన్టీఆర్ ఈ వీడియోలో ముస్లిం వలే టోపీ పెట్టుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. 
 
అలాగే కొన్ని షాట్స్ కాపీ కొట్టారంటూ నెటిజన్లు రాజమౌళిని ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి రియాక్షన్ వస్తుందని జక్కన్న అసలు ఊహించలేనట్టుంది. వచ్చిన విమర్శల గురించి సీరియస్‌గా ఆలోచిస్తున్నారట. టీమ్‌తో డిష్కస్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
 
అలాగే షూటింగ్ విషయంలో ఇక ఆలస్యం జరగకుండా స్పీడుగా వర్క్ చేసేందుకు ఏర్పాట్లు చేసారట. ఇక నుంచి పక్కా ప్లాన్‌తో షూటింగ్ చేసి సాధ్యమైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేయాలి అనుకుంటున్నారని సమాచారం. బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 
 
అయితే... ఎన్టీఆర్ వీడియోకి వచ్చిన విమర్శలను దృష్టిలో పెట్టుకుని ఇక నుంచి మరింత జాగ్రత్తగా సినిమా తీయాలి అనుకుంటున్నారట. మరి.. వస్తున్న విమర్శల గురించి జక్కన్న స్పందిస్తారేమో చూడాలి.