సోషల్ మీడియాలో భీమ్ బీభత్సం

komaram bheem
శ్రీ| Last Modified గురువారం, 22 అక్టోబరు 2020 (22:46 IST)
నేడు కొమురం భీమ్ 119వ జయంతి సందర్భంగా 'రామరాజు ఫర్ భీమ్' పేరుతో తారక్ ఇంట్రో వీడియోతో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ట్రిపుల్ ఆర్ చిత్రం యూనిట్ రిలీజ్ చేసింది. జూనియర్ ఎన్టీఆర్ ముస్లిం యువకుడిగా, బ్యాగ్రౌండ్‌లో కొమురం భీమ్ షాడో ఇమేజ్ కనిపించేలా డిజైన్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఎన్టీఆర్, రాజమౌళి అభిమానులకు రెండ్రోజుల ముందే దసరా తెచ్చేసినట్లైంది.

ఈ పోస్టర్ చూస్తుంటే స్వాతంత్ర్యానికి ముందు నైజాం ప్రాంతంలో రజాకార్లపై తిరుగుబాటు చేయడానికి.. కొమరం భీమ్ ముస్లింగా మారువేషంలో కనిపిస్తాడేమోనన్న ఆలోచన కలుగుతోంది. అదేవిధంగా రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో వచ్చిన టీజర్ లో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రని ఎలివేట్ చేశారు. ఈ టీజర్ అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ తెచ్చుకుంటోంది.

ఇప్పటికే యూట్యూబ్ లో 'రామరాజు ఫర్ భీమ్' రికార్డులు తిరగరాస్తోంది. విడుదలైన 7 నిమిషాల్లోనే 100K లైక్స్ సాధించిన టీజర్ గా రికార్డ్ స్థాయిలో వ్యూస్ సాధించి దసరా ఢమాకా మోగించేస్తోంది. ఈ టీజర్ గురించి సెలబ్రిటీలు కూడా పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. ఆర్.ఆర్.ఆర్' లో కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ అదరగొట్టేసాడని కామెంట్స్ పెడుతున్నారు.

'కొన్ని నెలలుగా అలుముకున్న నిరాశ నిస్పృహ దెబ్బకు పటాపంచలై.. అదే చోట ఆత్మస్థైర్యం.. ఆత్మ విశ్వాసం.. మీరు నిలబెట్టిన జెండాలా లేచి నిల్చున్నాయి'' అని హరీశ్ శంకర్ ట్వీట్ చేశాడు. అలానే 'స్టన్నింగ్ విజువల్స్.. ఎక్సెలెంట్ వాయిస్ ఓవర్.. స్మాషింగ్ టీజర్' అని దర్శకుడు అనిల్ రావిపూడి ట్వీట్ చేశాడు.

'వావ్ వావ్ వావ్.. అమేజింగ్ బ్రదర్.. మైండ్ బ్లోయింగ్ ఇన్స్పైరింగ్ టీజర్' అని దేవిశ్రీ ప్రసాద్, 'వైల్డ్ గా ఉన్నావ్ గురూ' అని రానా దగ్గుబాటి.. 'ఫెంటాస్టిక్.. భీకరంగా ఉన్నావని' వరుణ్ తేజ్‌లు కామెంట్ చేశారు.. 'గూస్ బమ్స్ వచ్చాయని' డైరెక్టర్ సుధీర్ వర్మ.. 'టెర్రిఫిక్ టీజర్' అని గోపీచంద్ మలినేని.. 'మాటల్లేవ్' అని రాశీఖన్నా పోస్ట్‌లు పెట్టారు. వీరితో పాటు డైరెక్టర్ బాబీ - మ్యూజిక్ డైరెక్టర్ థమన్ - రైటర్ వక్కంతం వంశీ - హీరోలు సుశాంత్ మరియు నారా రోహిత్ వంటి వారు 'రామరాజు ఫర్ భీమ్' టీజర్ అద్భుతహ: అంటూ ట్వీట్ చేశారు.దీనిపై మరింత చదవండి :