సంబంధిత వార్తలు
- అన్నమాచార్య సాహిత్యంతో కలకత్తా కె శ్రీవిద్య, సోదరుడు మోహన్ కణ్ణన్తో కలిసి భజన-గోవింద నందనందన
- ఆధునిక కళలు, సంస్కృతికి వేదికగా నిలిచిన హైదరాబాద్లోని దీవార్స్ స్టే క్యూరియస్ హెచ్క్యూ
- సంస్కృతం- ప్రాక్రిత్ స్టడీస్ ప్రోత్సాహానికి మూర్తి ట్రస్ట్ 75 మిలియన్ రూపాయలు
- అద్భుతం, అద్వితీయం... కుమారి అవని రెడ్డి నృత్యం
వార్షిక వేడుకలను జరుపుకున్న తత్వార్థ డ్యాన్స్ స్టూడియో
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తత్త్వార్థ సంబరంను ఇటీవల బెంగళూరులోని ADA రంగమందిర వద్ద తత్వార్థ డ్యాన్స్ స్టూడియో జరుపుకుంది. సంస్కృతీ, సంప్రదాయాలు ఉట్టిపడే రీతిలో నిర్వహించిన ఈ వేడుకలలో కళాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ వేడుకలలో 10 ఏళ్ల వయస్సు చిన్నారి కృతి ఆన్య కుల్దీప్‌తో పాటుగా 5 సంవత్సరాల వయస్సు కలిగిన చిన్నారి శ్రీ రష్నా అంజలి కులదీప్‌ల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
వీరు ఇరువురూ బెంగళూరు నగరానికి చెందిన ప్రఖ్యాత వ్యాపారవేత్త, ద బెంగుళూరు కంపెనీ-వ్యవస్థాపకుడు & సీఈఓ శ్రీ బంగారు కులదీప్ అంబూర్ సురేష్ బాబు నాయుడు కుమార్తెలు కావడం విశేషం. ఈ వేడుకలను ఆర్టిస్టిక్ డైరెక్టర్ కుమారి శివాని శివకుమార్, సీనియర్ నృత్య గురువు శ్రీమతి కావ్య శేఖర్ నేతృత్వంలో అట్టహాసంగా జరిగాయి.
