శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఏడు కిలోల వెండి నాణేలు స్వాధీనం
శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం నాడు ఒక ప్రయాణికుడి నుంచి 7 కిలోల వెండి నాణేలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) సిబ్బంది ప్రవేశ ద్వారం వద్ద సదరు ప్రయాణికుడిని అడ్డుకుని, అతని బ్యాగ్‌ను తనిఖీ చేయగా అందులో వెండి నాణేలు బయటపడ్డాయి.
న్యూఢిల్లీకి వెళ్లే విమానం ఎక్కడానికి అతను సిద్ధమవుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఆ వెండి నాణేల విలువను తెలుసుకోవడానికి సీఐఎస్ఎఫ్ అధికారులు ఆర్జీఐఏ పోలీసుల సహకారంతో ప్రయాణికుడిని విచారిస్తున్నారు.
