1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Passenger Arrested for Trying to Open Emergency Exit on Kuala Lumpur-Kochi Flight

కౌలాలంపూర్-కొచ్చి విమానంలో ఎమెర్జెన్సీ డోర్ తెరిచేందుకు ప్రయత్నించిన వ్యక్తి అరెస్ట్

Flight
కౌలాలంపూర్-కొచ్చి విమానంలో అత్యవసర ద్వారాన్ని తెరవడానికి ప్రయత్నించినట్లు, అలాగే తోటి ప్రయాణికులు, విమాన సిబ్బందిని బెదిరించినట్లు ఆరోపిస్తూ ఒక ప్రయాణికుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇంకా ద్వారం కిటికీ ప్యానెల్‌ను ధ్వంసం చేసినట్లు కూడా అతనిపై ఆరోపణ ఉంది. 
 
బుధవారం నాడు కౌలాలంపూర్ నుండి కొచ్చికి 'బాటిక్ ఎయిర్' విమానం (OD231)లో ప్రయాణిస్తున్న జంషీర్ అథనిక్కల్‌గా నిందితుడిని గుర్తించారు. ఎఫ్‌ఐఆర్ ప్రకారం, విమానం గాలిలో ప్రయాణిస్తున్న సమయంలో రాత్రి 9.30 గంటల నుండి 11.05 గంటల మధ్య ఈ ఘటన జరిగింది. 
 
విమానంలోని అత్యవసర ద్వారాన్ని బలవంతంగా తెరవడానికి ప్రయత్నించడం, కిటికీ ప్యానెల్‌ను ధ్వంసం చేయడం, తోటి ప్రయాణికులను బెదిరించడం ద్వారా విమానంలోని వారి భద్రతకు ముప్పు కలిగించాడని ఆ ప్రయాణికుడిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. క్యాబిన్ సిబ్బంది జోక్యం చేసుకుని ఆ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారని పోలీసులు తెలిపారు. 
 
కొచ్చిలోని బాటిక్ ఎయిర్ భద్రతా విభాగం అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. గురువారం తెల్లవారుజామున విమానం రాగానే నిందితుడిని అరెస్టు చేశారు. దీనిపై తదుపరి విచారణ కొనసాగుతోంది.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
తండ్రి అంత్యక్రియలకు రాని కుమార్తెలు.. వీడియో కాల్ ద్వారా అంతా ముగించేశారు.. (video)