1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. Bhojpuri film director acquitted in 2009 rape case filed by aspiring actor

''ఐటమ్ గర్ల్''గా ఛాన్స్ ఇస్తానని అత్యాచారం- వేరే యువతికి ఛాన్స్.. కేసు కొట్టివేత?

భోజ్‌పురి సినీ దర్శకుడు రాంకుమార్ కుమావత్ (51)పై వర్ధమాన నటి పెట్టిన అత్యాచారం కేసును ముంబై సెషన్స్ కోర్టు కొట్టిపారేసింది. ఐటమ్ సాంగ్‌లో అవకాశం ఇస్తానని చెప్పి.. తనపై లైంగికదాడికి పాల్పడ్డాడని రాంకుమ

Bhojpuri
భోజ్‌పురి సినీ దర్శకుడు రాంకుమార్ కుమావత్ (51)పై వర్ధమాన నటి పెట్టిన అత్యాచారం కేసును ముంబై సెషన్స్ కోర్టు కొట్టిపారేసింది. ఐటమ్ సాంగ్‌లో అవకాశం ఇస్తానని చెప్పి.. తనపై లైంగికదాడికి పాల్పడ్డాడని రాంకుమార్‌పై బాధితురాలు పిటిషన్ దాఖలు చేసింది.

అయితే వర్ధమాన నటి శరీర భాగాలపై ఉన్న గాయాలు కల్పితమేనని వైద్య నివేదికలో తేలడంతో పాటు.. రాంకుమార్, వర్ధమాన నటి పరస్పర అంగీకారంతోనే శృంగారంలో పాల్గొన్నారని న్యాయస్థానం నిర్ధారించింది. దీంతో కేసును కోర్టు కొట్టేసింది.  
 
అయితే బాధితురాలు చేసిన ఆరోపణల విషయానికి వస్తే.. 2009 జూలై 21న తన సినిమాలో ''ఐటెం గర్ల్‌'' అవకాశం ఇస్తానంటూ నటిని కుమావత్‌ తన కార్యాలయానికి పిలిచాడని చెప్పింది. ఆ సమయంలో తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలు తెలిపింది.

మరుసటి రోజు డ్యాన్స్‌ రిహార్సల్‌ పేరిట పిలిచి మరోసారి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తరువాత ఆ అవకాశం మరో యువతికి ఇచ్చాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. 
 
ఈ కేసు విచారణ సందర్భంగా సినిమాల్లో అవకాశం దొరుకుతుందన్న ఆశతోనే తాను ఆయన ఇంటికి వెళ్లానని, సినిమాలో తనకు అవకాశం దొరికి ఉంటే కేసు నమోదు చేసేదాన్ని కాదని డిఫెన్స్‌ లాయర్ క్రాస్‌ ఎగ్జామినేషన్‌‌లో బాధితురాలు స్పష్టం చేయడంతో.. కోర్టు కేసును కొట్టేసింది.
About Writer
selvi
తర్వాతి కథనం
జయలలిత మృతి.. అపోలో చైర్మన్‌ ప్రతాప్‌ రెడ్డికి సమన్లు.. విచారణకు రావాలని?