సంబంధిత వార్తలు
- కాలేజీ రోజుల్లో వేరొకరితో శృంగారం... ఇప్పుడు మరో సంబంధం.. ఎలా?
- ప్రేమ పీక్ స్టేజ్‌లో ఉంది.. ఇప్పట్లో పెళ్లి ప్రస్తావనే లేదు : వరలక్ష్మి
- ఖాళీగా వున్నాం.. అందుకే ఆ ఒక్క రోజులో పెళ్లి చేసుకోబోతున్నాం..
- పెళ్లి పేరుతో యువతితో కలిసి నగ్న స్నానాలు చేశాడు... చివరకు...
- భార్యాపిల్లలున్నారు మొర్రో అంటున్న వదల్లేదు.. పెళ్లి చేసుకోమని లేడీ కానిస్టేబుల్స్ ఒత్తిడి
ముహూర్త టైమ్‌కు వరుడు పరార్ : 21 యేళ్ళ వధువును పెళ్లాడిన 65 యేళ్ళ మామ
బీహార్ రాష్ట్రంలో మరో వింత సంఘటన ఒకటి జరిగింది. పెళ్లి పీటలపై కూర్చోవాల్సిన వరుడు ముహూర్త సమయానికి అదృశ్యమయ్యాడు. దీంతో ఆ వధువును 65 యేళ్ళ వయసున్న వరుడు తండ్రి (మామ) పెళ్లి చేసుకున్నాడు.
బీహార్ రాష్ట్రంలో మరో వింత సంఘటన ఒకటి జరిగింది. పెళ్లి పీటలపై కూర్చోవాల్సిన వరుడు ముహూర్త సమయానికి అదృశ్యమయ్యాడు. దీంతో ఆ వధువును 65 యేళ్ళ వయసున్న వరుడు తండ్రి (మామ) పెళ్లి చేసుకున్నాడు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నా సమీపంలోని సమష్టిపూర్‌కు చెందిన రోషన్ లాల్ (65) అనే వ్యక్తి కుమారుడుకి అదే ప్రాంతానికి చెందిన స్వప్న (21) అనే యువతినిచ్చి పెళ్లి చేయాలని ఇరు కుటుంబాల పెద్దలు నిర్ణయించారు.
వీరిద్దరి పెళ్లి ఆదివారం జరగాల్సి వుంది. ఇందుకోసం అన్ని రకాల ఏర్పాట్లూ కూడా చేశారు. పెళ్లి మండపానికి బంధువులతో పాటు వధూవరులు కూడా వచ్చారు.
అయితే, ముహూర్త సమయానికి వరుడు కనిపించకుండా పోయాడు. దీంతో పీటలపై పెళ్లి ఆగిపోయింది. ఈ పెళ్లి ఆగిపోతే తమ పరువు పోతుందని భావించిన వధువు తండ్రి.. తన కుమార్తెను వివాహం చేసుకోవాలని వరుడు తండ్రిని ప్రాధేయపడ్డాడు.
దీంతో 65 యేళ్ల రోషన్ లాల్ వధువు జీవితం పాటు వియ్యంకుడు కుటుంబ గౌరవ ప్రతిష్టలను కాపాడేందుకు 21 యేళ్ళ వధువును పెళ్లి చేసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
