గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 9 అక్టోబరు 2018 (18:26 IST)

పాకిస్థాన్ శాంతి చర్చలని డ్రామాలేస్తూనే.. అణ్వాయుధ క్షిపణి పరీక్ష

కుక్క తోక వంకర అన్న చందంగా పాకిస్థాన్ నడుచుకుంటోంది. ఎన్నిసార్లు చెప్పినా పాకిస్థాన్ పదేపదే కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది.

కుక్క తోక వంకర అన్న చందంగా పాకిస్థాన్ నడుచుకుంటోంది. ఎన్నిసార్లు చెప్పినా పాకిస్థాన్ పదేపదే కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. పాకిస్థాన్‌లో ఏర్పడిన కొత్త ప్రభుత్వం ఒకవైపు శాంతి చర్చలు అంటూ డ్రామాలేస్తూ.. మరోవైపు భారత్‌ను రెచ్చగొట్టే చర్యలకు దిగుతోంది.
 
ఇంతకీ పాకిస్థాన్ ఏం చేసిందటే..? భారీ అణ్వాయుధ సామర్థ్యం కలిగిన ఘౌరి బాలిస్టిక్ క్షిపణిని పాక్ సోమవారం విజయవంతంగా పరీక్షించింది. ఇంతకుముందు ఏప్రిల్ మాసంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన బాబర్ క్రూస్ మిస్సైల్‌ను పాక్ విజయవంతంగా పరీక్షించింది.
 
ఈ నేపథ్యంలో ఘౌరి మిస్సైల్ 1300 కిలో మీటర్ల దూరంలోని లక్ష్యాల్ని టార్గెట్ చేయగలదు. దీని పరిధిలోకి దక్షిణ భారతావనిలోని పలు నగరాలు రానున్నాయి. తమ సైనిక సామర్థ్యాన్ని పెంపొందించుకునే దిశగా ఈ క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు పాకిస్థాన్ ఆర్మీ మీడియా విభాగం వెల్లడించింది. 
 
స్ట్రాటజిక్ ప్లాన్స్ డివిజన్‌కు చెందిన పలువురు సీనియర్ అధికారులు, శాస్త్రవేత్తలు ఈ పరీక్షను నేరుగా వీక్షించినట్లు తెలిపింది. కాగా ఘౌరి బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టిన శాస్త్రవేత్తలకు పాక్ అధ్యక్షుడు డాక్టర్ అరీఫ్ అల్వీ, ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అభినందించారు.