సంబంధిత వార్తలు
- అమ్మాయిలే అందుకు తొందరపడుతున్నారట... డేటింగ్ కోసం షార్ట్ కట్స్ కోసం..?
- తెలుగు రాష్ట్రాల్లో భర్తలను చంపేస్తున్న భార్యలు...
- బాలగంగాధర్ తిలక్ ప్రారంభించిన స్కూల్లో 138 ఏళ్ల తర్వాత బాలికలకు ఎంట్రీ
- భర్తలకు రక్షణేది.. ఓ మహిళ ఆవేదన.. మగాళ్ళకూ ఓ కమిషన్ ఉండాల్సిందే...
- శనివారం పూట ఏ వస్తువు కొనాలి? ఏది కొనకూడదో తెలుసా?
ఇప్పటి అమ్మాయిలు ఇలా వున్నారు...
నేటి సమాజంలో ఆస్తి అంతస్తు, హోదా, మంచి ఉద్యోగం ఇలా.. అన్నీ అబ్బాయిలను అమ్మాయిలు ఇష్టపడతారన్నది అక్షర సత్యం. అయితే, నేటితరం అమ్మాయిలు మాత్రం.. ఇవేమీ అక్కర్లేదని, మంచి మనసున్న గుణవంతుడు, నిజమైన ప్రేమను పంచేవాడు తమకు భర్తగా రావాలని కోరుకుంటున్నారట. ఈ ని
నేటి సమాజంలో ఆస్తి అంతస్తు, హోదా, మంచి ఉద్యోగం ఇలా.. అన్నీ అబ్బాయిలను అమ్మాయిలు ఇష్టపడతారన్నది అక్షర సత్యం. అయితే, నేటితరం అమ్మాయిలు మాత్రం.. ఇవేమీ అక్కర్లేదని, మంచి మనసున్న గుణవంతుడు, నిజమైన ప్రేమను పంచేవాడు తమకు భర్తగా రావాలని కోరుకుంటున్నారట. ఈ నిజమైన ప్రేమ ముందు కులం, మతం, హోదా, ఆస్తి అంతస్తు ఏదీ నిలువదని తాజాగా నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది. ఈ సర్వేలో పాల్గొన్న యువతుల్లో 75 శాతం మంది నిజమైన ప్రేమకే ఓటు వేయడం గమనార్హం.
అలాగే, ఈ సర్వేలో పాల్గొన్న యువతుల్లో తమను కట్టుకునేవాడు సంపన్నుడు కాకపోయినా ఫర్వాలేదు కాదనీ.. సరసుడై ఉండాలని కోరుకున్నారు. కనీసం.. తన జీవితానికి సంతృప్తిని ఇవ్వగలిగిన వాడై ఉండాలని అభిప్రాయపడ్డారు. మరికొందరు అమ్మాయిలు మాత్రం తమ భర్త మంచి దేహదారుఢ్యం కలిగినవాడుగా ఉండాలని చెప్పారు.
అయితే, భారతీయ స్త్రీ మాత్రం.. తమ వైవాహిక జీవితానికి ఏం కావాలో బాగా తెలుసని, జీవిత భాగస్వామిని ఎన్నుకునేటపుడు వారు నిజమైన ప్రేమకే ఓటు వేస్తారని పలువురు మానసిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
