శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Srinivas
Last Modified: శనివారం, 9 జూన్ 2018 (19:21 IST)

అభిమాని కుటుంబాన్ని చూసి కంటతడి పెట్టిన పవన్ కళ్యాణ్...

పాయకరావుపేటలో మంగళవారం అర్థరాత్రి పవన్‌ కల్యాణ్‌ అభిమానులు ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుద్ఘాతానికి గురై ఇద్దరు యువకులు భీమవరపు శివ (28), తోళెం నాగరాజు(30) మృతి చెందారు. మరో ఇద్దరు ప్రాణాపాయం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. తునిలో విద్యుత్‌ షాక్‌తో మృత

పాయకరావుపేటలో మంగళవారం అర్థరాత్రి పవన్‌ కల్యాణ్‌ అభిమానులు ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుద్ఘాతానికి గురై ఇద్దరు యువకులు భీమవరపు శివ (28), తోళెం నాగరాజు(30) మృతి చెందారు. మరో ఇద్దరు ప్రాణాపాయం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. తునిలో విద్యుత్‌ షాక్‌తో మృతిచెందిన.. కార్యకర్త శివ కుటుంబాన్ని పవన్‌ పరామర్శించారు. 
 
అభిమానుల మృతిపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ తల్లడిల్లిపోయారు. శోకసంద్రంలో ఉన్న అభిమాని కుటుంబాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. శివకు మూడు నెలల బాబుకు పవన్ కళ్యాణ్ పేరు పెట్టారు. శివ కూరగాయలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. అమ్మానాన్నలకు ఆరోగ్యం సరిగా లేక ఇంటిపట్టునే ఉంటున్న విషయాన్ని స్థానిక నాయకులు, అభిమానులు పవన్ కళ్యాణ్‌కు తెలియజేయడంతో ఆ కుటంబాన్ని అన్నివేళలా అదుకుంటానని అధైర్యపడవద్దని శివ సతీమణి, తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు పవన్ కళ్యాణ్.