గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Srinivas
Last Modified: శనివారం, 9 జూన్ 2018 (18:46 IST)

మానవత్వాన్ని చాటిన ఏపీ మంత్రి అమరనాథ్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ మంత్రి అమరనాథ్ రెడ్డి తన మానవత్వాన్ని చాటారు. రేణిగుంట విమానాశ్రయంలో ముఖ్యమంత్రికి వీడ్కోలు పలికి పలమనేరుకు వెళ్తుండగా, పుత్తూరు-చిత్తూరు మార్గంమధ్యలో ఆర్కేడిపేట వద్ద బైక్ అదుపు తప్పి ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడి

ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ మంత్రి అమరనాథ్ రెడ్డి తన మానవత్వాన్ని చాటారు. రేణిగుంట విమానాశ్రయంలో ముఖ్యమంత్రికి వీడ్కోలు పలికి పలమనేరుకు వెళ్తుండగా, పుత్తూరు-చిత్తూరు మార్గంమధ్యలో ఆర్కేడిపేట వద్ద బైక్ అదుపు తప్పి ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన యువకులను గమనించిన మంత్రి అమరనాథరెడ్డి.. వెంటనే కారు దిగి  108 సమాచారం అందించారు. 
 
దగ్గర్లో ఉన్న కార్వేటినగర్ పిఎస్‌లో సమాచారం అందించి ఎస్సైని అలర్ట్ చేశారు. ప్రాథమిక చికిత్స కోసం మంత్రి అమరనాథరెడ్డి గాయపడిన వారిని పుత్తూరు ఆసుపత్రికి తరలించే ఏర్పాటు చేశారు. అలా అంబులెన్స్ ఎక్కించే వరకు గాయపడిన వారితోనే ఉన్న మంత్రి తర్వాత మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలించాలని అధికారులను ఆదేశించారు.